2025 జూలై 31న ప్రభుత్వ సెలవు ప్రకటించటం ఒక ముఖ్యమైన విషయంగా మారింది. ఈరోజు స్కూళ్లు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూసివేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సెలవు, స్వాతంత్ర్య సమరయోధుడు షాహీద్ ఉధమ్ సింగ్ జ్ఞాపకార్థంగా ఇవ్వబడింది. ఉధమ్ సింగ్ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు.
ఉధమ్ సింగ్ 1899లో పంజాబ్‌లో జన్మించారు. 1919లో జలియన్ వాలా బాగ్ హత్యాకాండ జరిగిన తర్వాత, అందుకు ప్రతీకారంగా 1940లో లండన్‌లో ఉన్న జనరల్ ఓ డయ్యర్‌ను హత్య చేశారు. ఈ సంఘటన బ్రిటిష్ పాలనను షేక్ చేసింది. అనంతరం ఆయనను బ్రిటన్‌లోని పెంటన్‌విల్లే జైలులో ఉరి వేయడం జరిగింది. ఈ సంఘటన భారత స్వాతంత్ర్య ఉద్యమానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది.
ఆయన దైర్యాన్ని గుర్తించి పంజాబ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూలై 31న సెలవు ప్రకటిస్తోంది. ఈ ఏడాది కూడా అదే విధంగా సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. అందువల్ల ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, కార్పొరేషన్ బోర్డులు అన్నీ మూసివేయబడ్డాయి.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఆగస్టు నెలలో వరుస సెలవులు వస్తున్నాయి. ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతం, 9న రాఖీ పౌర్ణమి, 10న ఆదివారం వల్ల మూడు రోజుల వరుస సెలవు ఉంటుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం కాబట్టి శుక్రవారం సెలవు, ఆ తరువాత శనివారం, ఆదివారం కూడా సెలవులు ఉండే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు విశ్రాంతికి మంచి సమయం దొరకనుంది.