Unimech Recruitment: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. రూ.19,500 జీతంతో ట్రైనింగ్ + శాశ్వత ఉద్యోగం!

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ (Vandhe Bharat) కు డిమాండ్ పెరుగుతోంది. ఇప్పటికే నడుస్తున్న వాటితో పాటుగా కొత్త వాటిని పట్టాలెక్కించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. విజయవాడ నుంచి బెంగళూరుకు వయా తిరుపతి వందేభారత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ రైలు ద్వారా నాలుగున్నార గంటల్లోనే తిరుపతికి చేరుకోవచ్చు. ఇక, నర్సాపురం నుంచి తరువణ్ణామలై రైలుకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో, ఏపీ నుంచి అరుణాచలం కు వందేభారత్ పై వస్తున్న డిమాండ్ పై సానుకూలంగా రైల్వే అధికారులు స్పందించినట్లు తెలుస్తోంది. మార్గం..షెడ్యూల్ పైన నిర్ణయానికి వచ్చారు.

Chandrababu Tour: ఆర్థిక రంగానికి ఊపిరి.. చంద్రబాబు ప్రయత్నాలకు ఫలితం! ఏపీలో పెట్టుబడులపై బార్క్ లే గ్రీన్ సిగ్నల్!


ఏపీ నుంచి అరుణాచలం (Arunachalam) వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతోంది. ప్రత్యేక రైళ్లు.. బస్సులకు పూర్తి స్థాయి లో డిమాండ్ కనిపిస్తోంది. దీంతో, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి తిరువణ్ణామలై కు ప్రత్యేక రైలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చొరవ తో నరసాపురం - తిరువణ్ణామలై ప్రత్యేక ట్రైన్​ను రైల్వే శాఖ కేటాయించింది. ఈ రైలు బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు బయలు దేరింది. గురువారం ఉదయం 5 గంటలకు తిరువణ్ణామలైకు చేరనుంది. తిరిగి గురువారం మధ్యాహ్నం 12 గంటలకు తిరువణ్ణామలైలో బయలుదేరి శుక్రవారం ఉదయం నరసాపురం చేరుకుంటుంది. ప్రయాణికుల రద్దీని బట్టి ఈ రైలును క్రమబద్ధీకరించాలని తొలుత భావించారు. అయితే, ఇప్పుడు నర్సాపురం నుంచి చెన్నై కు కొత్తగా వందేభారత్ ఏర్పాటు పైన జరిగిన కసరత్తులో భాగంగా కొత్త ప్రతిపాదన తెర మీదకు వచ్చింది.

2024 గణాంకాలు ప్రకారం.... పర్యాటక రాజధానిగా ఆ దేశం అగ్రస్థానం!


ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నై కు వందేభారత్ అందుబాటులో ఉంది. ఈ రైలు ద్వారా 6 గంటల 40 నిమిషాల్లోనే విజయవాడ నుంచి చెన్నైకి చేరుకోవచ్చు. చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. తిరుగు ప్రయాణం లో విజయవాడలో మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభయ్యే ఈ రైలు రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల్లో స్టాప్‌లు ఉన్నాయి. 3.49 గంటలకు తెనాలి చేరుకునే ఈ రైలు.. సాయంత్రం 5.03 గంటలకు ఒంగోలు వెళ్తుంది. ఈ రైలు నే తిరువణ్ణామలై కు లింకు చేయటం పైన సాధ్యాసాధ్యాలను పరిశీలన చేస్తున్నట్లు సమాచారం.

అదే విధంగా ఇప్పటికే విజయవాడ నుంచి బెంగళూరుకు ఖరారైన వందేభారత్ ఇంకా ప్రారంభం కాలేదు. షెడ్యూల్ తో పాటుగా రైట్ సైతం ఇప్పటికే ప్రకటించారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే నాలుగున్నార గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు. అయితే, నర్సాపురం నుంచి చెన్నైకు వందేభారత్ కోసం రైల్వే శాఖ వద్ద ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రస్తుతం విజయవాడ నుంచి చెన్నైకి నడుస్తున్న వందేభారత్ ను నర్సాపురం వరకు పొడిగింపు ప్రతిపాదన పైన కసరత్తు జరుగుతోంది. దీంతో.. ఈ రైళ్ల సర్దుబాటుతో పాటుగా తిరువణ్ణామలై వరకు వందేభారత్ ఖరారు చేయనున్నారు. వచ్చే వారం ఈ కొత్త సర్వీసు పైన అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Employment: ఇంజినీర్లకు గోల్డెన్ ఛాన్స్.. ఇమాజినోవేట్ ట్రెయినీ పోస్టులు ఖాళీ! QR కోడ్ స్కాన్ చేసి వెంటనే..!
Youtube: యూట్యూబ్‌లో చరిత్ర సృష్టించిన మిస్టర్ బీస్ట్.... 299 మిలియన్లతో!
Actor Prakash: నేడు ఈడీ విచారణకు నటుడు ప్రకాశ్ రాజ్..... బెట్టింగ్ యాప్స్!
Tirumala Update: ఆగస్టు నెలలో తిరుమ‌లలో విశేష ఉత్సవాలు.. ఈ తేదీల ప్రకారం ప్లాన్‌ చేసుకోండి.. మిస్‌ కాకండి!
Highcourt: ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! ఫలితాల నిలుపుదలపై తీవ్ర ఆగ్రహం!
Job Opportunities: TCSలో ఉద్యోగ అవకాశాలు! విశాఖపట్నం లో వాక్-ఇన్ డ్రైవ్! వారే అర్హులు..
Smart Meters: టెన్షన్ అస్సలు వద్దు.. స్మార్ట్ మీటర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మంత్రి ఆదేశాలు!