డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ట్రైనింగ్ & ప్లేస్‌మెంట్), మంగళగిరి, ఆంధ్రప్రదేశ్ వారు 2025 సంవత్సరానికి "యూనిమెచ్" కంపెనీలో డిప్లొమా విద్యార్థుల కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు.
ఈ అవకాశానికి 2025, 2024 మరియు 2023 సంవత్సరాల్లో డిప్లొమా మెకానికల్ ఇంజినీరింగ్ (DME) పూర్తి చేసిన విద్యార్థులు అర్హులు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు తొలిదశలో ఒక సంవత్సరపు శిక్షణా కాలంలో నెలకు రూ. 19,500/- జీతం అందించబడుతుంది.
శిక్షణ అనంతరం పనితీరుపై ఆధారపడి జీతం పెంపుతో పాటు శాశ్వత ఉద్యోగ అవకాశం కూడా కల్పించబడుతుంది. అర్హతకు కనీసం 60% మార్కులు ఉండాలి, అలాగే విద్యలో ఏ ఇతర బ్యాక్లాగ్‌లు ఉండకూడదు. ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ వాక్-ఇన్ ఇంటర్వ్యూల ద్వారా, బెంగళూరులో నిర్వహించబడుతుంది. ఎంపికైన అభ్యర్థులు బెంగళూరు లోనే ఉద్యోగ చేయవలసి ఉంటుంది.
ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనదలచిన అభ్యర్థులు 2025 ఆగస్టు 2వ తేదీలోపు అప్లై చేయాలి. పూర్తి వివరాల కోసం పోస్టర్‌లో ఇవ్వబడిన QR కోడ్‌ని స్కాన్ చేసి అప్లికేషన్ ఫారమ్‌ను సమర్పించవచ్చు. డిప్లొమా మెకానికల్ విద్యార్థుల కోసం ఇది ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు.