క్వార్జ్ట్ అక్రమాల కేసులో జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని (Former Minister Kakani Goverdhan Reddy) పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ఉదయం సీఐ సుబ్బారావు జిల్లా జైలుకు వెళ్లారు. జైలులోనే కాకాణికి వైద్య పరీక్షలు నిర్వహించారు. మాజీ మంత్రిని కస్టడీలోకి తీసుకుంటున్న నేపథ్యంలో జైలు వద్ద పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. కాకాణిని జైలు నుంచి కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం ఉంది. నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కస్టడీ కొనసాగనుంది. అక్రమ క్వార్జ్ తవ్వకాలు, భారీగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ఏ4గా ఉన్నారు. ఈ కేసులో మరింత సమాచారం తెలుసుకునేందుకు కాకాణిని కస్టడీలోకి ఇవ్వాల్సిందిగా నెల్లూరు కోర్టులో పోలీసులు పిటిషన్‌ వేశారు. దీంతో కాకాణిని మూడు రోజుల పాటు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని కోర్టు షరతు విధించింది.

ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!

క్వార్జ్ట్ అక్రమాలపై కేసు నమోదు అయిన తర్వాత దాదాపు రెండు నెలల పాటు పోలీసులకు చిక్కకుక్కుండా కాకాణి తప్పించుకుని తిరిగారు. ఈ క్రమంలో ఇటీవల బెంగళూరు శివారులో మాజీ మంత్రిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అయితే విచారణ సమయంలో కూడా పోలీసులకు ఏమాత్రం సహకరించలేదు కాకాణి. ఈ కేసులో సాక్షులు చెప్పిన విషయాలను కాకాణి ముందు ఉంచి ప్రశ్నించినప్పటికీ తనకు తెలియదు, సంబంధం లేదు అంటూ సమాధానాలు ఇస్తూ పోలీసుల విచారణకు సహకరించలేదు. ఈ క్రమంలో మూడు రోజుల పాటు కాకాణి పోలీస్ కస్టడీలో ఉండబోతున్నారు. కాకాణి తరలించే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. జైలు ప్రాంగణంతో పాటు కృష్ణపట్నం పోర్టు పోలీస్‌స్టేషన్ వద్ద కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు సెంట్రల్ జైలు వద్దకు భారీగా వైసీపీ నేతలు చేరుకున్నారు. దాదాపు 61వేల మెట్రిక్ టన్నుల క్వార్జ్‌ను ఆరు నెలల వ్యవధిలోనే తవ్వకాలు జరిపి ఇతర దేశాలకు తరలించారు. ఈ క్రమంలో క్వార్జ్‌ను తీసుకుని వెళ్లడంలో ఎవరెవరి పాత్ర ఉంది అనే అంశాలపై కాకాణిని పోలీసులు ప్రశ్నించనున్నారు.

ఇది కూడా చదవండి: ఏపీలో మరో నేషనల్ హైవే నాలుగు లైన్లుగా..! ఈ రూట్‌లో రూ.5వేల కోట్లతో, శ్రీశైలం త్వరగా వెళ్లొచ్చు..!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు: 

బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..

ఓ ఇంటి వాడైన అక్కినేని వారసుడు అఖిల్.. హాజరైన సినీ తారలు!

బిగ్ అప్డేట్.. ఈ విషయం తెలియకుండా అస్సలు ఫ్లైట్ ఎక్కొద్దు.. లేదంటే మీ పని అంతే.!

అమెరికాలోకి ప్రవేశంపై 19 దేశాలకు షాక్.. ట్రంప్ నుంచికొత్త ప్రయాణ నిషేధ ఉత్తర్వులు!

రైతులకి గుడ్ న్యూస్.. పంటకి కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సాయం! దరఖాస్తు ఇలా..

నా తప్పు మృగాళ్లందరికీ కనువిప్పు కావాలి.. పాపా నువ్వయినా నన్ను క్షమిస్తావా!

జగన్‌పై కేంద్రమంత్రి ఆగ్రహం.. మీ తీరు మారకపోతే ఈసారి మిగిలేది ఒక్కటే!

ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. విద్యా, దౌత్య వర్గాల్లో తీవ్ర ఆందోళన! వీసాల రద్దుకు కూడా ఆదేశాలు..

హామీల అమలుపై చర్చకు రావాలి.. వైకాపాకు మాజీ మంత్రి, తెదేపా ఎమ్మెల్యే సవాల్!

యువగళం పుస్తకం.. లోకేష్‌కు పవన్ అభినందనలు! ఆనాటి అనుభవాలను కళ్ల‌కి కట్టినట్లుగా..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group