Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ! Blue Moon: ఒకే నెలలో రెండు పౌర్ణములు.. అపోజీ స్థానంలో చందమామ: ఏమిటీ 'బ్లూ మైక్రోమూన్' కథ? NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు.. Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ! Blue Moon: ఒకే నెలలో రెండు పౌర్ణములు.. అపోజీ స్థానంలో చందమామ: ఏమిటీ 'బ్లూ మైక్రోమూన్' కథ? NASA: చంద్రుడిపై ఇల్లు కట్టనున్న మానవుడు.. 2030 నాటికి నాసా శాశ్వత స్థావరం! Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అవుతోందా... గ్యాలరీ ఖాళీ చేసినా మెమరీ నిండటం వెనుక అసలు కారణాలు ఇవే! C295 Aircraft: ఆకాశమే హద్దుగా భారత్ సరికొత్త చరిత్ర.. సిద్ధమైన తొలి 'మేడ్ ఇన్ ఇండియా' సీ-295 మిలిటరీ విమానం! Google Search: ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన గూగుల్ సెర్చ్.. భారత్‌లోనూ వినియోగదారుల తీవ్ర ఇబ్బందులు! Mobile Safety: మీ మొబైల్‌లో ఆ గ్రీన్ లైట్ వెలుగుతోందా? అయితే జాగ్రత్త! Phone Battery: యూజర్లకు అలర్ట్.. మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందా? కొత్త ఫోన్ కొనాల్సిన పని లేదు! ఈ టిప్స్ పాటిస్తే చాలు..

Green Energy: 18 గిగావాట్ల గ్రీన్ పవర్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్న ఏపీ!

Green Energy: ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి, విద్యుత్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది.

Published : 2026-05-29 20:25:00

ఏపీలో రూ.22 వేల కోట్లతో భారీ గ్రీన్ ఎనర్జీ కారిడార్..

160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు..

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో భారీ స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటు చేసి, విద్యుత్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ మేరకు 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద సుమారు రూ.22 వేల కోట్లతో ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు.

సమీక్షలో గ్రీన్ ఎనర్జీ కారిడార్, విద్యుత్ సరఫరా పరిస్థితులు, రాబోయే ఆరు నెలల ప్రణాళిక, పీఎం సూర్యఘర్, పీఎం కుసుమ్, పీఎంఈ-డ్రైవ్ పథకాల అమలు, డిజిటల్ ట్విన్ గ్రిడ్ నిర్మాణం, ఏపీఐఈసీ పాలసీ కింద ఆమోదించిన ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఫేజ్-3లో భాగంగా 18 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీని ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేందుకు కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు, భారీ పూలింగ్ స్టేషన్లు నిర్మించనున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఇందులో 11 గిగావాట్ల సోలార్ విద్యుత్, 7 గిగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను ప్రధాన గ్రిడ్‌కు అనుసంధానించేలా ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం 2,261 కిలోమీటర్ల మేర కొత్త ట్రాన్స్‌మిషన్ లైన్లు వేయనున్నారు.

అలాగే మొత్తం 9,500 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు భారీ పూలింగ్ స్టేషన్లను నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అనంతపురం జిల్లా ముదిగుబ్బ, తలుపుల, నెల్లూరు జిల్లా రామాయపట్నం, వైఎస్సార్ జిల్లా పోరుమామిళ్ల, ఉత్తరాంధ్రలోని కొప్పాక ప్రాంతాల్లో ఈ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. దానికి అనుగుణంగా విద్యుత్ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తయితే డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ సరఫరా సులభమవుతుందని, విద్యుత్ మౌలిక సదుపాయాలు పెరగడం వల్ల భారీ పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును సమయపాలనతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సమీక్షలో పీఎం సూర్యఘర్ పథకం అమలుపై కూడా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రవ్యాప్తంగా 200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెస్కో మోడల్, నెట్ మీటరింగ్ విధానంలో ఈ పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

చిత్తూరు జిల్లాలోని 78 గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా సోలార్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నెట్ జీరో విధానంలో 2,898 హాస్టళ్లు, పాఠశాలల్లో సోలారైజేషన్ చేపట్టేందుకు గుర్తింపు పూర్తయ్యిందని వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో సోలార్ వినియోగం పెరిగితే ప్రభుత్వంపై విద్యుత్ భారం తగ్గుతుందని సీఎం పేర్కొన్నారు.

పీఎం సూర్యఘర్ అమలులో ఏపీ ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉందని, త్వరలోనే అగ్రస్థానానికి చేరేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 1.35 లక్షల ఇళ్లలో ఇప్పటికే సోలార్ ప్యానెల్లు అమర్చినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఇళ్లలో ఆగస్టు నెలాఖరులోగా పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. బీసీ వర్గాలకు రూ.20 వేల సబ్సిడీతో 10 లక్షల ఇళ్లలో సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై కూడా సీఎం సమీక్షించారు. 131 ప్రాంతాల్లో 577 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. విద్యుత్ రంగంలో సాంకేతిక నష్టాలను తగ్గించేందుకు స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ‘ప్రవాహ్’ సంస్థ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థను అమలు చేస్తున్నట్లు వివరించారు. దేశంలోనే తొలిసారిగా డిజిటల్ ట్విన్ గ్రిడ్‌ను రూపొందిస్తున్నామని తెలిపారు.

విద్యుత్ డిమాండ్‌పై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. జూన్ నుంచి నవంబర్ 2026 మధ్య రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 12,226 మెగావాట్ల వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. రోజువారీ వినియోగం 226 నుంచి 261 మెగా యూనిట్ల వరకు చేరవచ్చని చెప్పారు. మే 21న రాష్ట్రంలో అత్యధికంగా 15,016 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైందని వెల్లడించారు.

రైతులకు లాభదాయకంగా ఉండే కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రత్యేక పాలసీ రూపొందించామని సీఎం తెలిపారు. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటులో అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదిలా ఉండగా, వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రతినిధుల బృందం కూడా సీఎం చంద్రబాబుతో భేటీ అయింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి థీమాటిక్ సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రీయల్ రెవల్యూషన్ (C4IR) అమలుపై చర్చించారు. గ్రీన్ ఎనర్జీ, ఎనర్జీ ట్రాన్సిషన్, సైబర్ రెసిలియెన్స్ రంగాల్లో అధ్యయనం చేపట్టనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ను గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో ప్రపంచ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు. విశాఖ డేటా సెంటర్ కారిడార్, గ్రీన్ హైడ్రోజన్ పెట్టుబడులను C4IR కార్యాచరణతో అనుసంధానం చేయాలని ఆదేశించారు. వచ్చే దావోస్ సదస్సు నాటికి ఏపీ సాధించిన పురోగతిని ప్రపంచానికి చూపించే స్థాయికి తీసుకురావాలని సీఎం పేర్కొన్నారు.

Spotlight

Read More →