Header Banner

మాస్ స్టైల్‌కి బ్రేక్ లేదు.. ఇప్పటివరకు చూడని పెర్ఫామెన్స్.. కొత్త లుక్‌! ఒక్క ఛార్జ్ తో 500కి.మీ.. ఫుల్ లగ్జరీ..

  Sat May 24, 2025 15:30        Business

టాటా మోటార్స్ (Tata Motors) అంటే నమ్మకానికి మరో పేరు. ఇటీవల కాలంలో మన దేశ మార్కెట్లో టాటా ఎస్‌యూవీలు విదేశీ కార్లకు గట్టి పోటీ ఇస్తూ, ప్రజలు కూడా ఎగబడి కొంటున్నారు. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని టాటా కంపెనీ కొత్త కొత్త కార్లను లాంచ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు రాబోయే కొద్ది నెలల్లో సరికొత్త ఎస్‌యూవీని అట్టహాసంగా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. టాటా కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరంలో సరికొత్త 'సియెరా' (Sierra) కారును విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. మొదట ఎలక్ట్రిక్ వెర్షన్ (EV) లో లాంచ్ అవుతుంది. ఆ తర్వాత, పెట్రోల్/డీజిల్ ఇంజిన్ ఆప్షన్లలో కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో తయారీ దశలో ఉన్న టాటా సియెరా ఎస్‌యూవీని ప్రదర్శించారు. బయట నుంచి చూస్తే ఇది చాలా మోడ్రన్‌గా కనిపిస్తుంది. LED హెడ్‌ల్యాంప్‌లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ మరియు బాడీ కలర్ బి-పిల్లర్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ వెర్షన్ సియెరా, పెద్ద సైజులో ఉంటుంది కాబట్టి, ఎక్కువ దూరం వెళ్లడానికి వీలుగా 75 కిలో వాట్ (kWh) సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉండవచ్చు. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే, ఇది 500 కిలోమీటర్ల వరకు రేంజ్ (మైలేజ్) ఇవ్వగలదని అంచనా వేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: భారత్ లో కొత్త బైక్ లాంచ్ చేసిన హోండా! ఆధునిక ఫీచర్లు, ఆకట్టుకునే డిజైన్‌తో...

 

ఇక ఇంధనంతో నడిచే సియెరా మోడల్ పవర్‎ఫుల్ ఇంజిన్‌తో వస్తుందని భావిస్తున్నారు. 1.5-లీటర్ టర్బో పెట్రోల్, 2-లీటర్ డీజిల్ ఇంజిన్‌లను కలిగి ఉండవచ్చు. దీనికి 6-స్పీడ్ మాన్యువల్/ ఆటోమేటిక్ లేదా 7-స్పీడ్ డీసీటీ గేర్‌బాక్స్ ఉండొచ్చు. మైలేజ్ విషయానికి వస్తే లీటరుకు 18 నుండి 20 కిలో మీటర్ల వరకు ఇవ్వగలదని అంచనా. ఇంధనంతో నడిచే సియెరా మోడల్ చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంటుందని, దాదాపు రూ.10 లక్షల ప్రారంభ ధరతో రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే, ఎలక్ట్రిక్ మోడల్ మాత్రం కాస్త ఖరీదైనదిగా ఉంటుంది. దీని ధర రూ.25 లక్షల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. కొత్త టాటా సియెరా కారులో పదుల సంఖ్యలో ఆకర్షణీయమైన ఫీచర్లు ఉంటాయని అంటున్నారు. ముఖ్యంగా 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటివి ఉండవచ్చు. కొత్త టాటా సియెరా ఎస్‌యూవీ భద్రతకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది. ప్రయాణికుల రక్షణ కోసం 7-ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), ఏడాస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్) మరియు 360-డిగ్రీ కెమెరా వంటి అధునాతన భద్రతా ఫీచర్లు ఉండే అవకాశం ఉంది. ఈ సియెరా కారు 5 సీట్ల ఆప్షన్‌తో వస్తుంది. ప్రయాణికులు చాలా సౌకర్యవంతంగా కూర్చుని ప్రయాణించవచ్చు. మొత్తంమీద, టాటా సియెరా భారతీయ మార్కెట్లో ఎస్‌యూవీ విభాగంలో ఒక సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ! ఇక నుండి అక్కడికి డైరెక్ట్ సర్వీసులు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

కారు ప్రమాదంలో మాజీమంత్రి మనవరాలి మృతి! మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా..

 

రెండు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌.. రేపు, ఎల్లుండి పొంచివున్న ముప్పు! భారీ నుంచి అతి భారీవర్షాలు!

 

విజయవాడలో హైఅలర్ట్.. బాంబు బెదిరింపులతో నగరంలో కలకలం!

 

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Car #Offer #NewCar #SUv #Hondacar