నేడు(27/09) టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కిడారి శ్రావణ్ గారు మరియు ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు వారితో పాటు గ్రీవియన్స్ లోని ఆనందబాబు ప్రజావినతులను స్వీకరించారు. ప్రజావేదిక పరిష్కారాల పూర్తి వివరాలు..
ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన నార్నె వెంకటసుబ్బయ్య నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావినతుల స్వీకరణ కార్యక్రమంలో నేతలకు అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో సర్వే నంబరు 879లో చెరువు పొరంబోకు, 883లోని అటవీ భూమిని దొంగరామదూత అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించి ఆశ్రమం పేరుతో యజ్ఞాలు, యాగాలు, దీక్షలు పేరుతో మోసం చేస్తున్నాడని. ఒక దొంగ స్వామి కొట్లాదిరూపాయల విలువగల ప్రభుత్వ భూమిని 25 ఏళ్లుగా ఆక్రమించి ఆశ్రమం పేరుతో బురుడికొట్టిస్తున్నాడని, అధికారులను ప్రలోభపెట్టి ఆ ప్రభుత్వ భూమిని విక్రయించాలని చూశాడని, సర్వే నెం. 883లోని అటవీ భూమిని అనాధపిల్లల స్కూల్ అని చెప్పి పైరవీలు చేసి జీవోలు తెచ్చుకున్నాడు.
వీటిపై ఫిర్యాదు చేస్తే విచారణకు వెళ్లినా అధికారులను కూడా ప్రలోభపెట్టి తప్పుడు రిపోర్టులు ఇప్పించి మోసం చేస్తున్నాడు. కావునా దొంగస్వామిపై చర్యలు తీసుకోని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని నేతలు మాజీ మంత్రి, ఏపీ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ కిడారి శ్రావణ్, ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్ వెంకట శివుడు యాదవ్ లకు అర్జీ ఇచ్చి అభ్యర్థించారు.
కోనసీమ జిల్లా పి. గన్నవరానికి చెందిన నీలం ఆనందరావు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని ఇంటి సరిహద్దుదారులైన యండ్ర రమణ, యండ్ర సొమన్న, కుసుపూడి రాము అనువార్లు తమ ఇంటి ప్రహారీ వద్ద అసాంఘిక కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని, గతంలో నుంచి ఇంటి సరిహద్దుదార్లలతో గొడవలు జరుగుతున్నాయని, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు అనుచరుడు కుడుపూడి రాము తమపై దాడి చేయించి అక్రమ కేసులు పెట్టించి ఇబ్బందులకు గురి చేశారని, ఈ గొడవల వలన తమ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారని, ప్రస్తుతం కేసు కోర్టు పరిధిలో ఉంది. ఈ కేసు ఈ విషయంలో పోలీసులు తమకు ఎలాంటి న్యాయం చేయలేదంటూ, కావునా వారిపై చర్యలు తీసుకోని తమ సమస్యను పరిష్కరించాలని కోరాడు.
నెల్లూరు జిల్లా కావలి మండలం అన్నగారిపాలెం గ్రామానికి చెందిన మాలకొండయ్య గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలోని సర్వే నెం.325 నందు 1.16 సెంట్లు 326లో 0.61 సెంట్లు, 317లో 0.50 సెంట్లు తమ భార్య లక్ష్మమ్మ పేరు మీద భూమి ఉంది. 60ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నానంటూ, అయితే తమ గ్రామానికి చెందిన ఆరుమంది వ్యక్తులు తమ భూమిని ఆక్రమించి దూర్భాషలాడి దాడి చేశారని దీనిపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే ఎలాంటి చర్యలు లేవని తర్వాత తహసీల్దార్ దగ్గరకి వెళ్తే అక్కడ కూడా పట్టించుకోవడం లేదు. కబ్జాదారులతో గ్రామ వీఆర్వో చేతులు కలిసి తమ భూమిని కాజేశారు. కావునా వారిపై చర్యలు తీసుకోని తమ భూమిని తమకు ఇప్పించాలని కోరాడు.
నెల్లూరు జిల్లా కావలి మండలం మన్నంగిదిన్నె గ్రామానికి చెందిన అంకమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. గిరిజనులైన తాము గత 50 సం॥లు నుండి సర్వే నెం. 1324లో భూములను సాగుచేసుకొంటూ జీవనము సాగిస్తున్నాము. అయితే అటవీ శాఖ వారు తాము సాగుచేస్తున్న సదరు భూములు అటవీ శాఖకు చెందినవి అని మమ్ములను అడ్డగించగా తాము కోర్టును ఆశ్రయించి డబ్లూ.పి. నెం.9695 /1981గా తెచ్చుకొనియున్నాము.
గతంలో కలెక్టర్ ముత్యాలరావు ఆధ్వర్యంలో గొల్లపాలెం బిట్ నందు సర్వే నె.1324లో ఆర్.ఓఎఫ్.ఆర్ 88 హెక్టార్లుకు గాను 96 ఎకరాల భూమిని మన్నంగిదిన్నె ఎస్టీ ట్రైబుల్స్ బినిషిషయర్స్ కి ఒక్కొక్క రైతుకు 0.90 సెంట్లు లెక్కన మంజూరు చేశారు. ఈ భూములకు సంబంధించి తామకు అన్నధాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి. అయితే పాస్ బుక్ లు కలిగిన ఈ భూములకు హద్దులు చూపించి శాశ్వత హక్కులు కల్పించాలని కోరారు.