ఏపీలో నిలిచిపోయిన కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వం 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి 2022 లో నోటిఫికేషన్ విడుదల చేసింది. గత ఏడాది జనవరిలో ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించగా, 4,59,182 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అభ్యర్ధులు పరీక్షలో అర్హత సాధించారు. అయితే ఫిజికల్ టెస్ట్‌కు 91,507 మంది అభ్యర్ధులు మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్షల తర్వాత కానిస్టేబుల్ పోస్టుల భర్తీ ప్రక్రియ పలు కారణాలతో నిలిచిపోయింది. దీంతో నిలిచిపోయిన భర్తీ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇన్‌చార్జి చైర్మన్ ఆకే రవికృష్ణ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ఫిజికల్ టెస్ట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయనున్నామని తెలిపారు. ఫిజికల్ టెస్ట్ కు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులకు మరో అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించారు. వారు ఈ నెల 11న సాయంత్రం 3 సాయంత్రం నుంచి సాయంత్రం 5 గంటల వరకు slrb.ap.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైసిపికి షాక్! మాజీ ఎంపీ పై కేసు నమోదు! రాజకీయాలను వీడనున్న వాసిరెడ్డి పద్మ? కారణమిదే!
వాలంటీర్లకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఇకపై ఆ బాధ్యతలు వారివే! రాజీనామా చేసిన వారి సంగతేంటి?
పెన్షన్ డబ్బులతో ఉద్యోగి పరార్! సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్!
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో మార్పు! ఎందుకో తెలుసా..?
ఈరోజే నామినేటెడ్ పోస్టుల రెండవ లిస్టు విడుదల? టీటీడీ చైర్మన్ ఆయనేనా?
పోలీసుల వేషంలో కిడ్నాప్ డ్రామా...చంపుతామని బెదిరింపు! వాహన తనిఖీలో నిందితులు అరెస్ట్!
మద్యంపై చేసే ఖర్చులో తెలుగు రాష్ట్రాలే టాప్! సంవత్సరానికి ఎంతో తెలుసా?
ఏపీలో మందుబాబులకు వెరైటీ ఆఫర్! ఒక బాటిల్ కొంటే అవి ఫ్రీ!
గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్ నియామక వివాదం! ఫోన్ సంభాషణ సోషల్ మీడియాలో హల్ చల్!
విభజన తర్వాత ఢిల్లీలో కొత్త ఏపీ భవన్ నిర్మాణానికి పచ్చ జెండా! నవంబర్ లోపు గుత్తేదారులకు ఆహ్వానం!
ఈ-చలాన్ పేరుతో కొత్త స్కామ్! ఒక్క క్లిక్ తో బ్యాంక్ అకౌంటు ఖాళీ! హెచ్చరికలు జారీ చేసిన కేంద్రం!
పార్లమెంట్ ఉభయసభలు ప్రత్యేక సమావేశం! ఎప్పుడు - ఎందుకు?
"ప్రజా వేదిక" కార్యక్రమంలో ఈరోజు పాల్గొననున్న మంత్రులు మరియు నాయకుల షెడ్యూల్! మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: