ప్రస్తుతం మార్కెట్‌లో అన్ని వర్గాల వినియోగదారుల అవసరాలు తీర్చే క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. ట్రావెలింగ్, షాపింగ్, బిల్ పేమెంట్స్, ఫ్యూయల్ కొనుగోళ్లపై స్పెషల్ డీల్స్ అందిస్తున్నాయి. సొంత వాహనాల్లో ఎక్కువ ప్రయాణాలు చేసేవారు వీటితో బెనిపిట్స్ అందుకుంటున్నారు. ఇలాంటి వారి కోసం మరో కొత్త క్రెడిట్ కార్డు లాంచ్ అయింది. తాజాగా ఆర్‌బీఎల్ బ్యాంక్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) సహకారంతో రూపే కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ కార్డును లాంచ్ చేసింది. ఈ ఇండియన్ ఆయిల్ ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ (IndianOil RBL Bank XTRA Credit Card) ద్వారా పెద్ద మొత్తంలో మనీ సేవ్ చేసుకోవచ్చు. ఈ కార్డ్ పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 8.5 శాతం ఆదా చేస్తుంది. యూపీఐ ఉపయోగించి పేమెంట్స్ చేసే ఆప్షన్ కూడా ఉంది. ఈ కార్డును బుధవారం ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2024లో ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్ NPCI రూపే నెట్‌వర్క్‌పై పని చేస్తుంది. దీన్ని అన్ని ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లలో, రూపే కార్డులను యాక్సెప్ట్ చేసే మర్చంట్స్ వద్ద ఉపయోగించవచ్చు.
ఇంకా చదవండి: పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ హెచ్చరిక! అప్రమత్తంగా లేకుంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే!
* యూపీఐ పేమెంట్ ఫెసిలిటీ..
ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ రూపే నెట్‌వర్క్‌పై పని చేస్తుంది కాబట్టి, యూపీఐ ఫెసిలిటీ ఉపయోగించుకోవచ్చు. ఈ క్రెడిట్ కార్డును యూపీఐ యాప్‌లతో లింక్ చేయవచ్చు. సమీపంలోని ఏదైనా కన్వీనియన్స్ స్టోర్‌లో మెర్చంట్ యూపీఐ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి నేరుగా పేమెంట్ చేయవచ్చు. అంతేకాకుండా ఆన్‌లైన్ మర్చంట్స్‌కి కూడా యూపీఐ పేమెంట్స్ చేసే సదుపాయం ఉంది.
ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ ఫీజు..
ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ మెంబర్‌షిప్ ఫీజు రూ.1,500గా ఉంది. అయితే ఏడాదిలోపు రూ.2.75 లక్షలు ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మాఫీ అవుతుంది.
క్రెడిట్ ఫీచర్లు
ఆర్‌బీఎల్ బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్ అందుకున్న 30 రోజుల్లోపు రూ.1500 ఖర్చు చేస్తే, వెల్‌కమ్ బెనిఫిట్ కింద 3000 ఫ్యూయల్ పాయింట్లు లభిస్తాయి. అలానే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకుల్లో ఖర్చు చేసే ప్రతి రూ.100కి 15 ఫ్యూయెల్ పాయింట్లు (రివార్డ్ రేట్ - 7.5%) సంపాదించే అవకాశం. ఈ కేటగిరీలో నెలకు గరిష్టంగా 2000 ఫ్యూయల్ పాయింట్లు అందుకోవచ్చు. అన్ని ఇతర కేటగిరీల ఖర్చుపై 2 ఫ్యూయల్ పాయింట్లను (రివార్డ్ రేటు - 1%) సంపాదించే అవకాశం.
ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు..
ఒక త్రైమాసికంలో రూ.75,000పైగా కార్డు ద్వారా ఖర్చు చేస్తే ఏకంగా 1000 ఫ్యూయల్ పాయింట్లు మైల్‌స్టోన్ బెనిఫిట్‌గా పొందుతారు. ఈ కార్డుతో రూ.500 నుంచి రూ.4,000 మధ్య పెట్రోల్ బంకులో పేమెంట్ చేస్తే, 1% ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు లభిస్తుంది. బిల్లింగ్ సైకిల్‌లో రూ.100 వరకు ఫ్యూయల్ సర్‌ఛార్జ్‌ను మాఫీ చేయవచ్చు.
‘ట్యాప్ అండ్ పే’ సదుపాయం..
ఈ కార్డ్ కాంటాక్ట్‌లెస్ టెక్నాలజీతో వస్తుంది. కస్టమర్‌లకు ‘ట్యాప్ అండ్ పే’ ఫెసిలిటీ అందిస్తుంది. అంటే కార్డ్ స్వైప్ చేయకుండా POS డివైజ్ ట్యాపింగ్ చేయడం ద్వారా పేమెంట్ చేయవచ్చు.
ఇంకా చదవండి: రూ.78 వేలు సబ్సిడీ! సామాన్యులకు కేంద్రం భారీ గుడ్ న్యూస్! మతిపోయే స్కీమ్!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: