మెయిడ్ మార్కెట్ ఎపిసోడ్ 7: By - Ch. Raja Sekhar
మెయిడ్ మార్కెట్ – ఏజెంట్ల ఉచ్ఛులో బిగుసుకుని ఎడారి దేశాల్లో అనాథ బతుకులు.
ఇంతకు ముందు రెండు ఎపిసోడ్ లలో ఇల్లీగల్ మ్యారేజ్ చేసుకొని పిల్లలను కన్న అభాగ్యుల దీన గాధ తెలుసుకుంన్నాము. ఇప్పుడు గల్ఫ్ లో కొంతమంది ఏజెంట్ల ఉచ్చులో పడి అనాదులుగా ఎలా మారారో.. ఎలాంటి పరిస్థితికి వచ్చారో.. తెలుసుకుందాం...
ఉన్న ఊరిలో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక, గంపెడు ఆశతో గల్ఫ్ దేశాలకు పయనమైనవారు ఏజెంట్ల చేతిలో మోసపోయి, దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరాయి దేశాల్లో పలుకరించే వారు లేక, సాయం చేసే చేతులు కనపడక అష్టకష్టాలు పడుతున్నారు. విజిట్ వీసాతో గల్ఫ్ దేశాలకు వెళ్లి, అక్కడ సేటు పెట్టే చిత్రహింసలు భరించలేక, ఎంతోమంది మహిళలు స్వచ్ఛంద సంస్థల ద్వారా పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ ఏజెంట్ల భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి, రోజు రోజుకి పోలిస్ స్టేషన్లో ఒక్కో కేసు నమోదవుతోంది.
కుసుమ కుమారి అనే మహిళను నాలుగు నెలల క్రితం ఓ ఏజెంట్ గల్ఫ్ పంపించాడు. (వాస్తవ సంఘటనల ఆధారంగా.. పేర్లు, ఊరు పేర్లు, అన్నీ మార్చి పెట్టడం జరిగింది) గల్ఫ్ వెళ్లిన 15 రోజుల పాటు ఇక్కడ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేది. తరువాత ఆమె వద్ద నుంచి ఫోన్, ఇతర సమాచారం కానీ అందడం లేదు. తాజాగా ఆ ఏజెంట్ వ్యవహారం వెలుగులోకి రావడంతో కుసుమ కుమారి బంధువులు ఆందోళనలో పడ్డారు. కుసుమ కుమారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు ఏమైందో తెలియడం లేదని రూ.2 లక్షలు తీసుకుని గల్ఫ్ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
మొదట్లో ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఇక్కడ 40 మందిని ఓ రూమ్‌లో పెట్టి పనికి పంపిస్తున్నారని, వేధింపులు ఎక్కువగా ఉన్నాయని వాపోయిందని, దానిని బట్టి చూస్తే తమ బిడ్డ పరిస్థితి దీనంగానే ఉండి ఉంటుందని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అలాగే అమలాపురం పట్టణంకి చెందిన సయ్యద్ అఫ్సర్ తాను గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయానని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకొల్లు కు చెందిన గల్ఫ్ ఏజెంట్ తనను, తన కుమార్తె ఫాతిమాను రూ.80 వేలు తీసుకుని గల్ఫ్ పంపించాడని తెలిపారు. అక్కడ తమను ప్రతి రోజు చిత్రహింసలు పెట్టేవారని, రోజుకోచోట గొడ్డుచాకరి చేయించేవారని చెప్పారు. అది భరించలేక తాను తిరిగి వచ్చేశానని, తన కూతురు మాత్రం అక్కడే చిత్రహింసలు అనుభవిస్తుందని తెలిపారు. తన కూతురును రప్పించి న్యాయం చేయాలని పోలీసులను పలువురు కోరారు.
ఇటీవల ఒమాన్ దేశంలో యజమానుల చేతిలో చిత్రహింసలు భరించలేక ఇంట్లో నుంచి పారిపోయి వచ్చి ఎంబసీలో కూడా తలదాచుకోవడానికి అవకాశం లేక దిక్కుతోచుని పరిస్థితుల్లో రోడ్లమీద, పార్కుల్లో నివాసం ఉంటున్న విషయంపై ఆంధ్రప్రవాసీ లో ప్రచురించడం జరిగింది ఆ లింకు కోసం ఇక్కడ క్లిక్ చేయండి:
ఇంకా చదవండి: ఛత్తీస్ గఢ్ లో దారుణం.. చేతబడి అనుమానంతో ఐదుగురి హత్య! అసలు విషయం తెలిస్తే షాక్!
ఏజెంట్ల మాయ మాటల్లో పడి ఉపాధి కోసం గల్ఫ్ బాట
ఉపాధి కోసం ఏపీ నుండి ఏటా లక్షా 50 వేల మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. వారిలో డెల్టా ప్రాంతం నుంచి ఎక్కువగా వెళుతున్నారు. నిరక్షరాస్యత కారణంగా వీసా నిబంధనలు తెలియకపోవడం గల్ఫ్ ఏజెంట్లకు వరంగా మారింది. దీంతో వారు మోసాలకు పాల్పడుతున్నారు. ఏజెంట్లు చేసే మోసాలు గుర్తించలేక డబ్బు ఆశతో గల్ఫ్ దేశాలకి వెళ్ళి చిత్రహింసలు అనుభవిస్తున్న వారు కొందరయితే, దిక్కు తోచని స్థితిలో వేశ్యా వృత్తిలోకి దిగేవారు కొందరు. ఇలా ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ఎజెంట్లని ఆశ్రయించి, సంతోషంతో అందలం ఎక్కేవారు కూడా ఉన్నారు. కష్టాలతో అదఃపాతాళానికి చేరుకున్న వాళ్ళూ ఉన్నారు. మరిన్ని వాస్తవ ఉదంతాలతో మరో భాగంలో మీ ముందుకు…
గల్ఫ్ మెయిడ్ మార్కెట్ ముందు భాగాలు:
1. గల్ఫ్ లో పని మనుషుల కోసం జరిగే దంధా! ఖర్చులు ఎంత అవుతాయి! ఏజెంట్ల చేతిలో ఎందుకు మోసపోతున్నారు!
రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!
ప్రత్యక్ష ప్రసార డిమాండ్‌తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్‌కు వైద్యుల గట్టి దెబ్బ!
ప్రధాని నివాసంలో పుంగనూరు లేక దూడ! ఆసక్తికర కామెంట్ చేసిన నారా లోకేశ్! నా స్వస్థలానికి చెందిన...
ఇప్పటికైనా మారకపోతే బెంగళూరు ప్యాలెస్ దాకా తరిమికొడతారు! జగన్‌పై మంత్రి ఫైర్!
ఇలా చేస్తే రూ.499కే వంటగ్యాస్ సిలిండర్.. ఇది గమనించారా? రహస్యంగా మూడో కంటికి తెలియకుండా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: