గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని ఈ ప్రతిష్ఠాత్మక అవార్డులకు ఎంపిక చేసింది. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ అవార్డులను అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఏడుగురికి పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ వచ్చాయి. టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌ను పద్మశ్రీ వరించింది.
కేంద్ర ప్రభుత్వం 139 మందికి పద్మ పురస్కారాలు.. ఆ వివరాలు మీకోసం!
