ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మంచితనంతో మీరంతా ఐదు నెలలకే రోడ్లపైకి వస్తున్నారు. ఆయన మంచితనంతో మా చేతులు కట్టేశారు' అంటూ వైకాపా నాయకులను ఉద్దేశించి అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్, తెదేపా నేత జేసీ ప్రభాకర్రెడ్డి మండిపడ్డారు. కక్షసాధింపుతో తన ఇంటి ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించిన మాజీ మంత్రి పేర్ని నానిపై నిప్పులు చెరిగారు. ఆదివారం అనంతపురంలోని నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 'చంద్రబాబు వయసు కూడా చూడకుండా నంద్యాలలో అర్థరాత్రి అరెస్టు చేశారు. ఆరోజు భువనేశ్వరి, లోకేశ్, బ్రాహ్మణి, బంధువులు ఏడ్చడం మీకు వినిపించలేదా?. మంత్రి కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడిపై కేసులు పెట్టారు. ఆరోజు మీరంతా ఆనందించారే. పవన్కల్యాణ్ నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడని పలుమార్లు అన్నావు. ఆయన మంచోడు కాబట్టి ఊరుకున్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఈ రోజు ఆయన అనుకుంటే మీరెక్కడుంటారు. నన్ను 120 రోజులు జైలులో పెట్టారు. ఎంత క్షోభ అనుభవించానో తెలుసా?. మాపైన కేసులు పెట్టినప్పుడు మాకు భార్య, కుమారుడు, కోడలు లేరా? ఇప్పుడు ఆడవాళ్ల గురించి మాట్లాడతారా?. పేర్ని నాని.. మచిలీపట్నంలో 1.12 ఎకరాల్లో నిర్మించిన గోదాము మీది కాదా? పేదల బియ్యం అమ్ముకుంటున్నావు. ఇంకోసారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే చరిత్ర బయటపెడతా' అని జేసీ హెచ్చరించారు. విద్యుత్తు ఛార్జీలు పెంచారని వైకాపా నాయకులు ధర్నాలు చేశారు, జగన్ ఎన్నిసార్లు ఛార్జీలు పెంచలేదని ప్రశ్నించారు. జగన్ ను రోడ్లపైకి రాకుండా చూడాలని చంద్రబాబును కోరారు. తనపై గతంలో అక్రమ కేసులు పెట్టారని, అప్పటి నుంచి గడ్డం పెంచుతున్నానని, వాటి నుంచి బయటపడిన రోజు తీసేస్తానని ఈ సందర్భంగా జేసీ చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మెడ నొప్పితో పాటు ఈ లక్షణాలు.. స్ట్రోక్‌కి సంకేతం కావచ్చు, తస్మా జాగ్రత్త!
గుడ్ న్యూస్.. ఏపీకి మరో అంతర్జాతీయ సంస్థ.. మంత్రి కీలక ప్రకటన! వేలల్లో ఉద్యోగావకాశాలు!
ఏపీలో పెట్రేగిపోతున్న ట్రోలింగ్.. బొత్స కాళ్లు నేనెందుకు పట్టుకుంటాను? క్లారిటీ ఇచ్చిన మంత్రి!
అమెరికా వీసాల్లో రికార్డ్! ఈ ఏడాది కూడా 10 లక్షలు! అధిక శాతం భారతీయులే.. అందులో తెలుగువారు!
వణికిస్తున్న విమాన ప్రమాదాలు.. తీవ్ర విషాదం.. రన్ వే మీదే కుప్పకూలిన విమానం! పెద్ద సంఖ్యలో మృతులు!
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: