ఏపీలో కొత్త ఏడాది వేళ మద్యం అమ్మకాలు భారీగా ఊపందుకున్నాయి. కూటమి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ విధానంతో అన్ని బ్రాండ్ల మద్యం అందుబాటులోకి వచ్చింది. రికార్డు స్థాయిలో అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే, ప్రభుత్వం రూ 99 కే మద్యం అందిస్తామని చెప్పటంతో.. ఇప్పుడు ఈ బ్రాండ్ల దే హవా కొనసాగుతోంది. 25 శాతం అమ్మకాలు ఈ బ్రాండ్ల నుంచే ఉన్నాయి. కాగా, ఈ స్థాయిలో అమ్మకాలు ఉన్నా.. ప్రభుత్వ ఆదాయం మాత్రం తగ్గుతోంది. ఏపీలో మద్యం అమ్మకాల్లో రూ. 99 మద్యానికి డిమాండ్ పెరుగుతోంది. మద్యం అమ్మకాల్లో సగటున ఈ మద్యం అమ్మకాలు 25 శాతం మేర ఉంటున్నాయి. కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ 99 కే మద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏపీలో ఈ మద్యానికి వస్తున్న డిమాండ్ తో ఇతర లిక్కర్ కంపెనీలు సైతం ఇదే రకం మద్యం తయారీకి సిద్దం అవుతున్నాయి. ఈ బ్రాండ్ల మద్యం అమ్మకాలు పెరగటంతో ప్రభుత్వానికి వచ్చే రెవిన్యూ తగ్గుతున్నట్లు ఎక్సైజ్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అదే సమయంలో షాపుల లైసెన్సీల ఆదాయమూ తగ్గుతోంది. కానీ, వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు అమ్మకాలు సాగుతున్నాయి. రూ. 99 మద్యంకు వినియోగదారుల నుంచి భారీగా డిమాండ్ ఉన్నట్లు మద్యం వ్యాపారులు చెబు తున్నారు.
ఇంకా చదవండి: ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
ప్రతీ నెలా రూ. 99 మద్యం సగటున 30 లక్షల కేసుల వరకు అమ్మకాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చిన సమయం నుంచి ప్రతీ నెలా వీటి అమ్మకాలు క్రమేణా పెరుగుతున్నాయి. నెల మొత్తం రాష్ట్రంలో అమ్మే 30 లక్షల కేసుల్లో 99 బ్రాండ్ల మద్యమే దాదాపుగా 8 లక్షలు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. గతంలో చీప్ లిక్కర్ ఉన్నా అమ్మకాలు ఈ స్థాయిలో ఎప్పుడూ కనిపించలేదని అధికారులు వెల్లడించారు. దీంతో, రానున్న రోజుల్లో ఈ 99 మద్యం అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు మరిన్ని మద్యం కంపెనీలు సైతం రూ. 99 కే మద్యం అందించే లా కసరత్తు చేస్తున్నాయి. కానీ, ఈ అమ్మకాలతో ప్రభుత్వ ఆదాయం తగ్గుతోంది. రూ.200 ధర ఉన్న సీసా అమ్మినప్పుడు ప్రభుత్వానికి రూ.170 ఆదాయం వస్తే.. రూ.99 సీసా అయితే అందులో సగమే వస్తుంది. వ్యాపారుల నుంచి రూ. 99 బ్రాండ్లు కావాలని ఎక్సైజ్ శాఖపై ఒత్తిడి పెరుగుతోంది. కానీ, రూ 99 కే మద్యం అందిస్తామనే హామీ మేరకు ప్రస్తుతం ఆదాయం తగ్గుతున్నా పెరుగుతున్నఅమ్మకాలతో తగ్గుతున్న ఆదాయం భర్తీ చేసుకునే ఆలోచనలో ఎక్సైజ్ శాఖ ప్రణాళికలు సిద్దం చేస్తోంది.
ఇంకా చదవండి: నామినేటెడ్ పదవుల జాబితా సిద్దం! మూడు పార్టీల నుంచి పదవులు ఎవరికంటే? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం ఎప్పుడంటే?
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
7 సీటర్ కార్ కొనాలి అనుకునే వారికి గుడ్ న్యూస్! అతి తక్కువ ధరతో.. భారీ ఆఫర్లతో.. ఈ అవకాశం పోతే రాదు!
ఏపీలో పెన్షనర్లకు శుభవార్త! న్యూ ఇయర్ గిఫ్ట్ గా ప్రభుత్వం కీలక నిర్ణయం!
జగన్ ఇంటి ముందు ధర్నా చేయాలి.. ప్రపంచంలో ఇంత వింత ఎక్కడా! మంత్రి మండిపాటు!
రేవంత్ రెడ్డికి కీలక ప్రతిపాదనలు చేసిన సినీ ప్రముఖులు! ప్రస్తుత ప్రభుత్వంపై.. అవేంటంటే!
ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. వాటిపై 90 శాతం రాయితీ! వెంటనే పొందండి..
తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: