అమరావతి ఔటర్ రింగ్ రోడ్డును ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఈ మేరకు రూపొందించిన ఓఆర్ఆర్ ఎలైన్మెంట్ను అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. ఓఆర్ఆర్ ప్రతిపాదిత మ్యాప్ను ముఖ్యమంత్రికి చూపించారు. దీన్ని పరిశీలించిన సీఎం.. పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఎక్కువ వంపులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ప్రతిపాదిత అమరావతి రింగ్ రోడ్డుకు మరో ప్రత్యేకత. ఈ ఓఆర్ఆర్ 7 జాతీయ రహదారులకు అనుసంధానం కానుంది. దీంతో కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో కనెక్టివిటీ మరింత పెరగనుంది. దీని నిర్మాణం పూర్తయితే.. గుంటూరు, విజయవాడ నగరాల్లోకి ప్రవేశించకుండానే.. హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై నగరాలకు వెళ్లవచ్చు.
ఇంకా చదవండి: ప్రధాని మోదీతో దాదాపు గంటపాటు చంద్రబాబు భేటీ! పలు కీలక అంశాలపై కీలక నిర్ణయం!
7 జాతీయ రహదారులతో.. కొండమోడు - పేరేచర్ల (ఎన్ హెచ్ - 163ఇజి) మచిలీపట్నం - హైదరాబాద్ (ఎన్ హెచ్-65) చెన్నై- కోల్కతా (ఎన్ హెచ్ - 16) విజయవాడ - ఖమ్మం - నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ రహదారి (ఎన్హెచ్ - 163జి). గుంటూరు - అనంతపురం (ఎన్ హెచ్ - 544డి) ఇబ్రహీంపట్నం - జగదల్పుర్ (ఎన్ హెచ్ - 30) అనంతపురం జిల్లాలోని కొడికొండ చెకోపోస్టు నుంచి ముప్పవరం వరకు. ముఖ్యమంత్రికి వివరించిన ఎలైన్మెంట్కి ఇప్పటికే సీఆర్డీఏ ఎన్ఎసీ జారీ చేసింది. రోడ్లు భవనాలశాఖ కూడా ఎన్సీసీ జారీ చేస్తే.. ఆ ప్రతిపాదనను ఎన్హెహెచ్పీ.. కేంద్ర ఉపరితల రవాణాశాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఇంకా చదవండి: కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీ! రాష్ట్రంలోని పలు రైల్వే ప్రాజెక్టులపై!
అక్కడ ఖరారైతే రింగ్ రోడ్డు నిర్మాణం కోసం భూసేకరణ, ఇతర ప్రక్రియలు మొదలవుతాయని ఆఫీసర్లు చెబుతున్నారు. రింగ్ రోడ్డు నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ప్రతిపాదిత రింగ్ రోడ్డు మొత్తం ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ఉంది. దీనికి సంబంధించిన మ్యాప్ ప్రకారం.. కృష్ణా జిల్లాల్లోని నందిగామ, మైలవరం, గన్నవరం, పెనమలూరు, గుంటూరు జిల్లాలోని తెనాలి, గుంటూరు, తాడికొండ నియోజకవర్గాల పరిధిలో ఉంది. దీంతో ఆయా ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతాయని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.
ఇంకా చదవండి: తిరుమల భక్తులకు శుభవార్త! గంటలోనే శ్రీవారి దర్శనం - అమల్లోకి టీటీడీ కొత్త విధానం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: