మాజీ మంత్రి విడదల రజనీ చిక్కుల్లో పడ్డారు. మంత్రిగా ఉన్న సమయంలో విడదల రజనీ అక్రమ వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నేరుగా హోం మంత్రిని కలిసి పలువురు రజనీ పైన ఫిర్యాదులు చేసారు. అందులో కొందరు పోలీసు అధికారులు భాగస్వాములు అయినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటి పైన విచారణ చేసిన విజిలెన్స్ అధికారులు తాజాగా రజనీ అక్రమాలను తేల్చారు. ప్రభుత్వానికి నివేదిక ఇవ్వటం తో ఇప్పుడు తదుపరి చర్యల పైన ఉత్కంఠ కొనసాగుతోంది. మాజీ మంత్రి విడదల రజనీ అక్రమ వసూళ్ల పైన విజిలెన్స్ ఆధారాలు సేకరించింది. ప్రభుత్వాని కి నివేదిక ఇచ్చింది. విడదల రజనీ రూ.2 కోట్లు తీసుకున్నట్లు తేల్చిన విజిలెన్స్ అందుకు సహకరించిన వారి పేర్లను వెల్లడించింది. పోలీసు, మైనింగ్ అధికారులతో కలిసి వ్యాపారులను రజనీ బెదిరింపులకు గురి చేసారనే ఆరోపణల పైన విజిలెన్స్ విచారణ చేసింది.
ఇంకా చదవండి: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల! ఎప్పటి నుంచీ ఎప్పటి వరకుఅంటే?
ఇందులో ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. రజనీ 2019 లో వైసీపీ నుంచి చిలకలూరి పేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2017లో జగన్ కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసారు. ఆ సమయం లోనూ మంత్రిగా ఉంటూ పలువురి నుంచి అక్రమ వసూళ్లు చేసారనే ఆరోపణలు వచ్చాయి. చిలుకలూరిపేట పరిధిలోని స్టోర్ క్రషర్ నిర్వహిస్తున్న యాజమాన్యం నుంచి వసూళ్లకు పాల్పడ్డా రని కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వచ్చాయి. రజనీ మద్దతుదారులు వారితో నగదు ఇవ్వాలనే చర్చలు చేసారు. వారు అందుకు అంగీకరించకపోవటంతో అక్రమ మైనింగ్ చేశారని అధికారులతో రూ. 50 కోట్ల ఫైన్ వేయించినట్లు తెలుస్తోంది.
ఇంకా చదవండి: గూగుల్ ఇయర్ ఇన్ సెర్చ్ 2024 లిస్ట్! నెటిజన్లు ఎక్కువగా ఏమి వెతికారో తెలుసా? పవన్ కల్యాణ్ స్థానం ఎంతంటే?
దాంతో ఆ వ్యాపారులు రాజీకి వచ్చారు. వారిని పోలీసు అధికారి జాషువా బెదిరించినట్లు ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఆ తరువాత వ్యాపారుల నుంచి అందరూ కలిసి రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసారు. ఇందులో రెండు కోట్లు విడదల రజనికి అందినట్లు విజిలెన్స్ విచారణలో తేల్చారు. అదే విధంగా మిగిలిన సొమ్ములో పది లక్షలు రజనీ పీఏకి వెళ్లగా.. మరో పది లక్షలు పోలీసు అధికారి జాషువా తీసుకున్నట్లుగా విజిలెన్స్ నిర్దారించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఇక, ఇప్పుడు విజిలెన్స్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కనిపిస్తోంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మంత్రి లోకేశ్ ను మెచ్చుకున్న చంద్రబాబు! ఎందుకు అంటే! ప్రతి సంక్షోభంలోనూ అవకాశాలు..
ఆయన మా నాన్న కాదు.. ఆ హక్కు లేదు -మంచు మనోజ్! ఏడు నెలల కూతురును కూడా!
వైన్ షాపులపై గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి! బెల్ట్ షాపుల యజమానులపై.. ఇక కిక్కు ఎక్కాల్సిందే!
ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. పరీక్ష లేకుండానే ఎంపిక! ఈ అర్హతలు ఉంటే చాలు.. Don't Miss
నామినేటెడ్ పోస్టులు అన్నీ ఒకే సారి విడుదల? ఎప్పుడు అంటే?
ఏపీలో కూటమి సర్కార్ క్రిస్మస్ కానుక.. మంత్రి కీలక ప్రకటన! రాష్ట్రంలో రూ.340 కోట్లతో..
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
మరో ఫుడ్ పాయిజన్ ఘటన... రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఆగ్రహం! విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ!
ఏపీకి త్వరలో కొత్త డీజీపీ... మొదలైన కసరత్తు! రేసులో ఎవరంటే..!
చంద్రబాబు కీలక నిర్ణయం.. నాగబాబుకు కీలక పదవి - టీడీపీ రాజ్యసభ సభ్యుల ఖరారు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: