ఏపీలో రైతులకు మంచి శుభవార్తే అనుకోవచ్చు. మొక్కజొన్న సాగు చేస్తున్న రైతులకు వారు కోరుకుంటున్నదానికంటే ఎక్కువగానే మార్కెట్ ధర నడుస్తోంది. దిగుబడి తక్కువగా ఉన్నప్పటికీ లాభాలు మాత్రం భారీగా వచ్చే అవకాశముందంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధరకన్నా బహిరంగ మార్కెట్ ధరే ఎక్కువగా నడుస్తోంది. ఈ ఏడాది మొక్కజొన్న పంట దిగుబడి తగ్గుతున్నట్లు అంచనాలున్నాయి. కత్తెర పురుగు వల్ల ఖరీఫ్ సాగు విస్తీర్ణం తగ్గడమే ఇందుకు కారణం. ప్రభుత్వ మద్దతు ధర రూ.2వేలు ఉండగా మార్కెట్ లో క్వింటా రూ.3వేలు పలుకుతోంది. ఈ ఖరీఫ్ సీజన్ లో ఒక్క కృష్ణా జిల్లాలోనే దాదాపు నాలుగువేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు ఉందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు. అయితే ఈ పంటను కత్తెర పురుగు దెబ్బతీస్తోందన్నారు. దీని నివారణకు సరైన మందు లేదని, ఫెర్టిలైజర్లు ఎక్కువగా ఉపయోగిస్తే తయారీదారులు పంటను కొనడంలేదని చెప్పారు. పాప్ కార్న్, స్వీట్ కార్న్ తయారీదారులే ఎక్కువగా రైతుల నుంచి మొక్కజొన్నను కొనుగోలు చేస్తుంటారు. అయితే ఈ సారి దిగుబడి తక్కువగా ఉండటంతో అధిక రేటు చెల్లించి మరీ కొనుగోలు చేస్తున్నారంటున్నారు. రైతులు మాత్రం కత్తెర పురుగు నివారణకు మందు కనిపెట్టాలని వ్యవసాయశాఖ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇంకా చదవండి: ఏపీ సర్కార్ కీలక ప్రకటన! భవన నిర్మాణాలు, లేఅవుట్ అప్రూవల్ సేవలకు బ్రేక్! అమెజాన్ వెబ్ సర్వీసెస్‌లో!
నవంబరు, డిసెంబరు నెలల్లో వరి కోతలు కోసిన తర్వాత మొక్కజొన్న విత్తులు విత్తుకోవాలి. తేమను నిలుపుకునే నేలలో మాత్రమ మొక్కజొన్నను సాగుచేయాల్సి ఉంటుంది. వరి కోతల తర్వాత భూమిపై తడి లేకపోతే తేలికపాటి తడి ఇచ్చి మొక్క జొన్న విత్తనాలను చల్లాలి. పంటకు మంచి మార్కెట్ ధర రావాలంటే నాణ్యతా ప్రమాణాలను పాటించడం తప్పనిసరి. అన్నదాతలంతా ఈ విషయాన్ని కచ్చితంగా పాటించాలి. గింజల్లో 14 శాతానికి మించకుండా తేమ ఉండాలి. అలాగే పాడైన గింజలు 1.5 శాతానికి మించకుండా చూసుకోవాలి. రాళ్లు, పెళ్లలు, చెత్త మట్టి, దుమ్ములాంటివి, ఇతర ఆహార గింజలు ఒక శాతం కంటే ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. అలాగే కీటకాలు ఆశించిన గింజలు కూడా ఒక శాతానికి మించకూడదు. అప్పుడు నాణ్యమైన మొక్కజొన్న పండుతుంది. అన్నదాతలకు అధిక ధర వస్తుంది. ఎంత నాణ్యతను పాటిస్తే అంత ధర వస్తుందనుకోవచ్చు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ రాజకీయాల్లో సంచలనం.. జగన్‌కు భారీ షాక్! పతనం కోరుకుంటున్న వైఎస్ షర్మిల!!
దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!
లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!
బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!
చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!
ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!
రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్! ప్రస్తుతం తనకు మరో వ్యక్తి!
కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!
సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: