గత వారం రోజులుగా ఏపీలో వైఎస్ జగన్ కుటుంబ వివాదం హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆస్తుల కోసం అని జగన్ తన తల్లి వైఎస్ విజయమ్మ, చెల్లి వైఎస్ షర్మిలపై కోర్టులో ఫిటిషన్లు దాఖలు చేశారు. దీంతో ఏపీ పీసీసీ చీఫ్ అయిన షర్మిల తన అన్నపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఆస్తుల కోసం తల్లిని కోర్టుకి ఈడ్చిన వ్యక్తి జగన్’’ అంటూ మండిపడ్డారు. సరస్వతి పవన్ సంస్థల వాటాలు విషయంలో జగన్ కోర్టుకు వెళ్లగా.. తాజాగా ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు. అయితే ఈ సంస్థకు ఉన్న భూములపై వెంటనే సర్వే చేయాలంటూ పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పల్నాడు జిల్లాలో సరస్వతి పవర్ సంస్థకు వేల ఎకరాల భూములు ఉన్నాయి. అయితే ఆ భూముల్లో కొన్ని అటవీ భూములు కూడా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అటవీ, పర్యావరణశాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సరస్వతి భూములను తక్షణమే సర్వే చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇంకా చదవండి: విజయవాడ - విశాఖ మధ్య మరో రెండు విమాన సర్వీసులు! కేంద్ర మంత్రి చేతుల మీదుగా - ఎప్పటినుంచి అంటే!

పవన్ ఆదేశాల మేరకు శనివారం అటవీశాఖ అధికారులు పల్నాడు జిల్లాలోని దాచేపల్లి, మాచవరం మండలాల్లో అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు జీపీఎస్ సర్వే చేశారు. సరస్వతి పవర్ సంస్థకు 1500లకు పైగా ఎకరాల్లో వాగులు, వంకలతో పాటుగా, కొండ భూములు, ప్రకృతి సంపద ఉన్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. సరస్వతి పవర్ సంస్థకు చెందిన భూముల వ్యవహారంపై ఉన్నతాధికారులతో చర్చించారు. సరస్వతి పవర్ సంస్థ భూముల్లో ప్రభుత్వ భూములు, జలవనరులు ఎంత వరకూ ఉన్నాయనే దానిపై వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. సర్వే పూర్తి అయిన తర్వాత వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

"జగన్ ప్రయోజనాల కోసం నేను, అమ్మ చాలా కష్టపడ్డాం. జగన్ కోసం రెండు ఎన్నికల్లో పాదయాత్రలు చేశాను. ఓసారి ఏకంగా 3,200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నేను చేసిన తప్పేంటో చెప్పాలని వైసీపీ శ్రేణులను అడుగుతున్నా. జగన్ కోసం నేను ఎంతో కష్టపడ్డాను... నా కోసం జగన్ ఏం చేశారు? ఆస్తులకు సంబంధించిన ఎంవోయూ పత్రాలు ఐదేళ్ల పాటు నా వద్దే ఉన్నాయి... ఎన్ని కష్టాలు వచ్చినా ఆ ఎంవోయూ నేను వాడుకోలేదు. వైఎస్ కుటుంబం గురించి చెడుగా చెప్పుకుంటారనే నేను మాట్లాడలేదు. విజయమ్మను కోర్టుకు లాగారంటే దానికి కారణం ఎవరు? సొంత కొడుకే తల్లిని కోర్టుకు లాగడం దారుణం కాదా? ఇలాంటివి చూసేందుకే ఇంకా బతికున్నానని అమ్మ బాధపడుతోంది. లాభం కలుగుతుందని భావిస్తే జగన్ ఎవరినైనా వాడుకుంటారు. లాభం ఉండదని తెలిస్తే జగన్ ఎవరినైనా అణచివేస్తారు. ఇలాంటి వ్యక్తి మీకు నాయకుడో, లేక ఉన్మాదో వైసీపీ శ్రేణులు ఆలోచించాలి" అని షర్మిల పేర్కొన్నారు.



ఇంకా చదవండి: బంగ్లాదేశీ ఏజెంట్ చేతిలో చిక్కుకొని మోసపోయిన ఆంధ్ర ఆడపడుచులు! చివరికి జీవితాలు బుగ్గి పాలు! గల్ఫ్ దేశాలకు వెళ్లేవారికి హెచ్చరిక! 12

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

దీపావళి పండగ ముందు సామాన్యులకు బ్యాడ్‌న్యూస్! భారీగా పెరిగిన వంటనూనె ధరలు! ఎంతో తెలిస్తే షాక్!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్: ఆ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్! మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు - వారికి పండగే!

యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఏపీ! అమెరికాలో మంత్రి లోకేశ్ - డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని!

లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!

బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!

15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!

చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!

ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!

రెండో పెళ్లి గురించి స‌మంత షాకింగ్ కామెంట్స్‌! ప్ర‌స్తుతం త‌న‌కు మ‌రో వ్య‌క్తి!

కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!

సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group