అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ చెప్పారు. యువతకు రాబోయే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా ఆరు పాలసీలను ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని ప్రస్తావించారు. శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ... ‘ నాలుగవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు మీ నుంచి రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు కియా ఒక ఉదాహరణ. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉంది. ఏపీలో దేశంలోనే 2వ అతిపెద్ద తీరప్రాంతం ఉంది. త్వరలో 4 కొత్త పోర్టులు రాబోతున్నాయి. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇప్పటికే దేశంలో తయారయ్యే సెల్ ఫోన్లలో 25 శాతం ఏపీలోనే తయారవుతున్నాయి. దేశవ్యాప్తంగా 50 శాతం ఏసీలు కూడా ఏపీలోనే తయారవుతున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నాం’’ అని అన్నారు.
ఇంకా చదవండి: చదవడం, రాయడం వస్తే చాలు.. ఈ ఉద్యోగం మీదే! ఉచితంగా 30 నుంచి 45 రోజుల శిక్షణ, భోజన!
డిసెంబర్ నుంచి అమరావతి రాజధాని పనులు..
కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజయన్‌లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణపనులు ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ‘‘గోదావరి జిల్లాల్లో ఆక్వా ఎక్స్ ఫోర్ట్స్, పెట్రో కెమికల్స్, గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలు, ఉత్తరాంధ్రలో కెమికల్, ఫార్మా రంగాలపై దృష్టిసారించాం. రాష్ట్రానికి ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రాబోతున్నాయి. త్వరలో టీసీఎస్ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించబోతోంది. రాష్ట్రాన్ని గ్లోబల్ మాన్యూఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు యువకుడైన సాయికాంత్ వర్మ నేతృత్వంలో ఈడీబీని పునరుద్దరించాం. రాజకీయంగా జాతీయ స్థాయిలో కీలకపాత్ర వహిస్తుండటం ఏపీకి కలసొస్తోంది. భారత్‌లో డేటా రెవెల్యూషన్ రాబోతోంది. ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పారిశ్రామిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అందులో ఏపీ కీలకపాత్ర పోషించబోతోంది. ప్రధాని మంత్రి మోదీ 2047 వికసిత్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం వేగవంతంగా ముందుకు సాగుతోంది. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలి’’ అని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
లక్షా రూ.70 వేల ల్యాప్‌టాప్ జస్ట్ రూ.30 వేలకే.. ఆఫర్‌లో కొనడం మంచిదేనా? ఎక్కడి నుంచి తెస్తారు?
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! నవంబర్ 4 వరకు ఆ సేవలు బంద్!
బాబాయ్ కామెంట్స్ పై షర్మిల కంతటడి! మోచేతి నీళ్లు తాగే వ్యక్తి - జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు!
15 కేసులతో రౌడీషీటర్ వైకాపా సానుభూతిపరుడు కస్టడీకి! గుంటూరు న్యాయస్థానం కీలక ఆదేశం!
చంద్రబాబు చేసిన ఈ వంట అంటే భువనేశ్వరికి చాలా ఇష్టం అంట! ఇది అస్సలు ఊహించి ఉండరు!
ఛీ ఛీ వీడు మనిషి కాదు! పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక కిరాతకం! ఇలా కూడా ఉంటారా.. అసలు ఏం జరిగింది!
రెండో పెళ్లి గురించి సమంత షాకింగ్ కామెంట్స్! ప్రస్తుతం తనకు మరో వ్యక్తి!
కొత్త బైక్ తీసుకోవాలనుకునే వారికి గుడ్ న్యూస్! దీపావళికి బంపర్ ఆఫర్.. కేవలం రూ.6,999లకే బైక్.!
నిరుద్యోగులకు గుడ్ న్యూస్! ఆంధ్రప్రదేశ్ లో కొత్త చట్టం - టీచర్లకోసం సంచలన నిర్ణయం!
సినీ నటి పక్కన కూర్చోవడానికి కేటీఆర్ నిరాకరణ... ఎందుకంటే? ఇది మరీ ఓవర్గా ఉంది అంటూ!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: