టాలీవుడ్ స్టార్ హీరో, ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహించిన ‘ఆహా’ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారమవుతున్న ‘అన్‌స్టాపబుల్’ షో చంద్రబాబు పలు కీలక విషయాలను వెల్లడించారు. ఈ షోలో బాలయ్య అడిగిన ప్రశ్నలకే కాకుండా మధ్యలో తెరపై కనిపించిన మనవడు దేవాంశ్ ప్రశ్నలకు కూడా చంద్రబాబు తనదైన శైలిలో జవాబు ఇచ్చారు. మీకు వంట వచ్చా అని చంద్రబాబుని బాలయ్య అడగ్గా ఆయన చెప్పిన సమాధానం విని అందరూ ఆశ్యర్యానికి గురయ్యారు. తనకు వంట చేయడం కూడా వచ్చని చంద్రబాబు చెప్పకనే చెప్పారు. ‘అన్‌స్టాపబుల్’ షోలో భాగంగా బాలయ్య పప్పు, ఆమ్లెట్ అనే రెండు ఆప్షన్లు ఇస్తూ, వాటిలో ఏది ఇష్టం అని అడిగినప్పుడు చంద్రబాబు తన దైన శైలిలో జవాబిచ్చారు. చంద్రబాబును, మీకు వంట వస్తుందా అని బాలయ్య అడగ్గా, చంద్రబాబు ‘నీకు వచ్చా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. బాలయ్య ‘తనకు వంట రాదు కానీ సలహాలు మాత్రం బాగా ఇస్తాను’ అని నవ్వుతూ చెప్పాడు. చంద్రబాబు ‘తాను పప్పు బ్రహ్మాండంగా చేస్తానని, ఆమ్లెట్ వేస్తానని’ సమాధానం ఇచ్చారు. కుదిరితే భువనేశ్వరితో కప్పు కాఫీ ‘టీ, కాఫీ లలో ఏది ఇష్టం?’ అన్న ప్రశ్నకు చంద్రబాబు, ‘ప్రతిరోజూ ఉదయం 8.30 నుంచి 9.30 మధ్య కాఫీ తాగుతాను. హైదరాబాద్‌లో ఇంట్లో ఉన్నప్పుడు భువనేశ్వరితో కలసి తాగుతాను. అమరావతిలో ఉంటే డైనింగ్ టేబుల్‌తోనే సరిపెడతాను. హైదరాబాద్‌లో ఆమె ఉండడం వల్ల కలసి కూర్చునే అవకాశం తక్కువగా ఉంటుంది.
ఇంకా చదవండి: పవన్ ఆదేశాలు... సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ మంత్రి! జగన్ - షర్మిల ఆస్తుల పంపకం వ్యవహారంలో తెరపైకి!
అలాంటి సందర్భం వస్తే అది మా పెద్ద పండుగ’ అని తెలిపారు. ‘విశాఖ, విజయవాడల్లో ఏ నగరం ఇష్టం?’ అన్న ప్రశ్నకు ఆయన, తన ఛాయిస్ అమరావతేనని, విశాఖ, విజయవాడ రెండింటినీ అభివృద్ధి చేస్తామని అన్నారు. మనవడు దేవాంశ్ తెరపై కనిపించి చంద్రబాబును కొన్ని ప్రశ్నలు అడిగగా.. అదిరిపోయే సమాధానాలు ఇచ్చారు చంద్రబాబు. దానికి చంద్రబాబు చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు. ‘మీరు ఎప్పుడూ రాజకీయాల్లో మునిగిపోతుంటారు కదా, తీరిక సమయాల్లో ఏమి చేస్తారు?’ అని దేవాంశ్ ప్రశ్నించాడు. దానికి బదులుగా చంద్రబాబు, ‘నువ్వు టైం ఇస్తే నీతో ఆడుకుంటూ రిలాక్స్ అయ్యేవాణ్ని. కానీ ఇప్పుడు నువ్వు టైం ఇవ్వట్లేదు కదా? నువ్వు ఎప్పుడూ లెక్కలతో కుస్తీ పడుతుంటావు. బోర్ కొడితే సైన్స్ చదువుతూ రిలాక్స్ అవుతావు. నేను కూడా పని మార్చుకుంటే రిలాక్సేషన్ వస్తుంది’ అని బదులిచ్చారు. ‘ఎప్పుడూ ముందే ఉంటుంది, కానీ కనిపించదు. అదేంటి?’ అని దేవాంశ్ పొడుపుకథ అడిగగా.. దానికి చంద్రబాబు ‘భవిష్యత్తు’ అని బదులిచ్చారు. ‘మీరు చేసిన మోస్ట్ అల్లరి పనేంటి?’ అని దేవాంశ్ అడగ్గా, చంద్రబాబు బాలయ్యను ఉద్దేశించి.. ‘కాలేజీ రోజుల్లో నీ చిలిపి చేష్టల గురించి తెలిసి ఈ ప్రశ్న నిన్ను అడుగుతున్నట్టున్నాడు’ అంటూ తప్పించుకున్నారు. దానికి బాలయ్య స్పందిస్తూ, ‘వీడు తెలిసి అడుగుతున్నాడో, తెలియక అడుగుతున్నాడో గానీ పొలిటిషియన్ అవుతాడేమోనని నా అనుమానం’ అని నవ్వుతూ చెప్పారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!
ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: