ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాల నాయకులతో జరిపిన చర్చలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల బదిలీలకు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం త్వరలో ప్రత్యేక చట్టం తీసుకురావడానికి సిద్ధం అయ్యింది. అసెంబ్లీ సమావేశాల్లో ముసాయిదా బిల్లును ప్రవేశపెట్టి అనుమతి తీసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఉద్యోగంలో చేరినప్పటి నుండి పట్టణ ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో పనిచేసేలా కొత్త చట్టం తీసుకొస్తున్నారు. బదిలీలకు గరిష్టంగా 8 సంవత్సరాల సర్వీస్ నిర్ణయించనున్నారని, కనీస సర్వీస్ సమయం ఎంత అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు ఉండే ప్రాంతాలను నాలుగు కేటగిరులు విభజించడానికి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ఈ కొత్త చట్టం వచ్చిన తరువాత సిఫారసు బదిలీలు లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోందని తెలిసింది.
ఇంకా చదవండి: టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం! కార్డు ఉంటే సమాజంలో ఓ గౌరవం! సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు!
బదిలీల చట్టంపై ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను తీసుకునేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు శుక్రవారం ప్రత్యక్ష ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు పలు సూచనలు చేశారని సమాచారం. ఇలాంటి ప్రత్యేక చట్టం ఇప్పటికే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రాల్లో ఉన్నాయి. ఇలాంటి చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేసి మెరిట్ కమ్ రోస్టర్ పద్దతి అమలు చేయాలని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిసింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు వారి సమస్యలు, టీచర్ల బదిలీల గురించి, ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో అనుసరించాల్సిన విధివిధానాల గురించి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు పలు సూచనలతో పాటు వారి సమస్యలపై మనవి చేశారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విద్యాశాఖ అధికారులు చర్చలు జరిపి ఓ వేదిక సిద్ధం చేసి చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి సమర్పించనున్నారని తెలిసింది. గత వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నారని, అలాంటి సమస్యలు మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని ఉపాధ్యాయ సంఘాలు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖకు మనవి చేశారని తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే మేము అధికారంలోకి వస్తే ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!
ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: