ముంబై నటి జత్వానీ కేసును ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. కేసు వివరాలను ఇబ్రహీంపట్నం పోలీసులు సీఐడీకి అందజేయనున్నారు. ఈ మేరకు సీఐడీ అధికారులు ఈ కేసుపై మరో రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో దర్యాప్తును ప్రారంభించనున్నారు. కాగా వైసీపీ హయాంలో నటి జత్వానీపై వేధింపులు, అక్రమ కేసు నమోదు చేశారు. ఈ కేసు వెనుక వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు సీతారామాంజనేయులు, కాంతి రాణా, విశాల్ గున్ని ప్రమేయం ఉందని విచారణలో తేలింది. దీంతో విద్యాసాగర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం ఇప్పటికే సస్పెండ్ చేసింది. ఈ కేసును సీఐడీకి అప్పగించాలన్న డిమాండ్తో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
పాకిస్థాన్ యువతిని ఆన్‌లైన్‌లో పెళ్లి చేసుకున్న బీజేపీ కార్పొరేటర్ కొడుకు! పెళ్లి కూతురు తరపువారు!
ఏపీలో మద్యం బాబుల సందడి! ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో!
ఆధార్ కార్డ్ ఉన్న వారికి శుభవార్త.. ప్రభుత్వం కీలక ప్రకటన! జిల్లాలలో 5 నుంచి 15 ఏళ్ల వయసు!
రూ.3 లక్షల 50 వేల జీతం.. పరీక్ష లేకుండా నేరుగా జాబ్, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇదే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: