రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు సంబంధిత అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అధికారుల బృందాన్ని పిఠాపురం నియోజకవర్గానికి పంపించి క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలపై పరిశీలన చేయించి నివేదికలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పిఠాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సి.హెచ్.సి.)లో వైద్యులు, సిబ్బంది కొరత, ఎక్స్ రే యూనిట్ పని చేయకపోవడాన్ని గుర్తించారు. దీనిపై కాకినాడ జిల్లా కలెక్టర్, డి.ఎం.అండ్ హెచ్.ఓ.లతో చర్చించారు.
ఇంకా చదవండి: ఏపీ మద్యం షాపులకు భారీ డిమాండ్ - విదేశాల నుంచీ దరఖాస్తులు! నేడే డెడ్ లైన్!
తక్షణమే పిఠాపురం సి.హెచ్.సి.లో వైద్యులను, సిబ్బందిని నియమించాలని పవన్ ఆదేశించారు. నియోజకవర్గంలో పెద్ద ఆసుపత్రి అయిన సి.హెచ్.సి.లో మెరుగైన వైద్య సేవలు అందించాలని, రోగులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకూడదని స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, మెడికల్ ఆఫీసర్ లను పిఠాపురం సి.హెచ్.సి.లో నియమించారు. అదే విధంగా ముగ్గురు స్టాఫ్ నర్సులను, ఒక జనరల్ డ్యూటీ అటెండెంట్ లను నిర్ణయించారు. అలానే ఎక్స్ రే యూనిట్ ను పునరుద్ధరించారు. దీంతో ఎక్స్‌రే యూనిట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీహెచ్‌సీ మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
వెంటనే ఏపీకి వెళ్లిపోండి - 11 మంది తెలంగాణ ఐఏఎస్, ఐపీఎస్ లకు కేంద్రం ఆదేశం! కారణం ఏమిటి!
ఏపీలో బయటపడ్డ మరో నగ్న వీడియో! ఈసారి ఆ పార్టీ నేత బుక్కైయ్యడు! అసలు ఏమి జరిగింది!
మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై పరువు నష్టం దావా! అనుచిత వ్యాఖ్యలపై కోర్టు నోటీసులు!
రాష్ట్రాలకు పన్నుల వాటా విడుదల చేసిన కేంద్రం... ఏపీ, తెలంగాణకు ఎంతంటే! అత్యధికంగా యూపీకి!
ఏపీ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్! గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు విడుదల!
చిలకలూరిపేటలో ఐసీఐసీఐ బ్యాంకు భారీ కుంభకోణం! సీఐడీ విచారణలో సంచలన రహస్యాలు!
వైసీపీ పతనానికి కర్త, కర్మ, క్రియ అన్నీ జగనే! కలలో కూడా రెడ్ బుక్కే వస్తుంది!
రెండు రోజుల్లో 2 అడుగుల ఎత్తు, 3 అడుగుల వెడల్పు పుట్ట గొడుగు! మన్యం అడవుల్లో వింత ప్రకృతి దృశ్యం!
ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు వెల్లువెత్తిన దరఖాస్తులు! ప్రభుత్వ ఖజానాకు భారీ ఆదాయం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: