తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేస్తామని ఆ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బాబు మోహన్ ఆదివారం ఎన్టీఆర్ భవన్‌కు వచ్చి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కలిశారు. దీంతో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు భారతీయ జనతా పార్టీలో కొనసాగిన బాబు మోహన్.. ఆ తర్వాత ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరారు. అయితే, ప్రజాశాంతి పార్టీలో చేరినప్పటికీ.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. గత కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న బాబు మోహన్ తాజాగా, చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం సాయంత్రం పార్టీ నేతలతో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.
ఇంకా చదవండి: ఎన్ కన్వెన్షన్ మీద వస్తున్న వార్తల్లో నిజాల కంటే అబద్దాలే ఎక్కువ! నాగార్జున ఎమోషనల్ పోస్ట్!
పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని నాయకులను ఆదేశించారు. పనితీరు బాగున్న వారికే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు ఉన్న అన్ని కమిటీలను చంద్రబాబు రద్దు చేయడం గమనార్హం. తెలంగాణ పార్టీ నేతలతో భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. టీటీడీపీకి చెందిన గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి కమిటీలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో టీటీడీపీ అధ్యక్షుడి ఎంపికతో పాటు నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆన్‌లైన్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదుపై సీరియస్‌గా ఫోకస్ పెట్టాలని ఆదేశించారు. అత్యధిక సభ్యత్వాలు నమోదు చేయించిన వారికి పార్టీ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. యువ రక్తానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించామని, అది మీ అందరి అభిమానంతోనే సాధ్యమైందని చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో కూడా టీడీపీకి ఎంతోమంది అభిమానులు, కార్యకర్తలు ఉన్నారని చెప్పారు.
ఇంకా చదవండి: ఏపీ గుడ్ న్యూస్.. ఈ స్కీమ్ కి మీరు అర్హులా! అయితే ఇప్పుడే అప్లై చేయండి! మీ లైఫ్ సెటిల్ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
విజయవాడలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ! సుజనా చౌదరి సీటులో టీడీపీకి గుడ్ న్యూస్!
పవన్ కళ్యాణ్ కొత్త ట్రెండ్! ఇది ఎవ్వరూ ఊహించి ఉండరు, ఈ నెల 24న పిఠాపురంలో భారీగా!
విద్యార్థులకు అదిరే గుడ్ న్యూస్! ప్రతి నెలా రూ.1,000 అకౌంట్లలోకి! వెంటనే అప్లై చేసుకోండిలా!
పర్యాటకులకు శ్రీలంక గుడ్ న్యూస్! భారత్ సహా 35 దేశాలకు వీసా లేకుండా!
గత ప్రభుత్వ వైఫల్యాలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం! 13,326 పంచాయతీల్లో కొత్త మార్పుల వెలుగులు!
దేశాన్ని అదానీ, అంబానీలకు అప్పగించిన మోదీ? రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు!
టీడీపీ రాష్ట్ర కార్యాలయంపై దాడి కేసులో కీలక మలుపు! మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి!
ఏపీలో 15వేల సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు - గుడ్ న్యూస్ చెప్పిన లోకేష్! ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన! వెలుగులోకి మరో సంచలన విషయం!
అందుకే నేను ఎక్కువగా తమిళంలో నటించడం లేదు! సంగీత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్!
తల్లులకు గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు సర్కార్! అకౌంట్లలో రూ.15 వేలు!
ఇంకా ఏం చేస్తే ఇలాంటి సంఘటనల్ని ఆపగలం? కోల్‌కతా హత్యాచార ఘటనపై విజయశాంతి ట్వీట్!
అధ్యక్షుడిగా గెలిస్తే మస్క్ కు కేబినెట్ లో చోటిస్తా! ట్రంప్ ఇచ్చిన బంపర్ ఆఫర్!
టీడీపీ కేంద్ర కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం! వెల్లువెత్తిన విజ్ఞప్తులు!
ఆధార్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికీ అదిరే శుభవార్త! అంగన్‌వాడీ, సచివాలయాల్లో ఈ నెల 20 నుంచి!
18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల లోపు మహిళలకు గుడ్ న్యూస్! గొప్ప అవకాశం.. ఇప్పుడు మిస్ చేసుకుంటే ఇక అంతే!
కేశినేని చిన్నికి కీలక పదవి! వచ్చే నెల 8న అధికారిక ప్రకటన!
అక్కాచెల్లెమ్మలకు చంద్రబాబు భారీ శుభవార్త! రక్షాబంధన్ కానుక అదరహో?
రేషన్ కార్డు దారులకు గుడ్‌న్యూస్! మరో కీలక మార్పు! ఇక ఆ సమస్యకు చెక్ చెప్పిన ఏపీ ప్రభుత్వం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: