ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. నిన్న సాయంత్రం హస్తినకు వెళ్లిన ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో బేటీ అయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితిని వివరించారు. ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఢిల్లీ నుంచి చంద్రబాబు విజయవాడ బయలుదేరనున్నారు. 9.30 గంటలకు చంద్రబాబు అధికారిక నివాసం 1. జనపథ్ లో జరగనున్న పూజలో పాల్కొననున్నారు. అయితే ఆర్థిక మంత్రి నిర్మలతో భేటీ అవుతారని నిన్న వార్తలు వచ్చాయి. అయితే అధికారులు మాత్రం నిర్మలతో భేటీ లేదని అంటున్నారు.

ఇంకా చదవండి: నీతి ఆయోగ్ ప్రత్యేక ఆహ్వానితుడిగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు! ఇక ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో!

కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించి పొందుపరచాల్సిన అంశాలతో పాటు తక్షణం అవసరమైన నిధులు, మంజూరు చేయాల్సిన ప్రాజెక్టుల గురించి అమిత్ షాతో చంద్రబాబు ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర దుర్భర ఆర్థిక పరిస్థితి, గత ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలతో పరిస్థితులు ఎంత దిగజారాయో వివరించారు. జగన్‌ పాలనలో ఆర్థిక అసమర్థత, ఆర్థిక నిర్వహణలో తీవ్ర వైఫల్యం, విచ్చలవిడి అవినీతి వల్ల రాష్ట్రానికి ఎనలేని నష్టం జరిగిందని అమిత్‌ షాకు చెప్పినట్లు ఆ తర్వాత చంద్రబాబు విలేకరులకు తెలిపారు. ఎన్డీయేకి ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడినపెట్టేందుకు, ఎకానమీ కోలుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తాయని చెప్పారు.


ఇంకా చదవండి: తెలుగుదేశం పార్టీ శ్రేణుల కొసం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో! సీఎం చంద్రబాబు ఆదేశాలమేరకు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికా జోరుగా సాగుతున్న తెలుగువారి హవా! ఉపాధ్యక్ష అభ్యర్థి ఆంధ్రా అల్లుడు!

గుజరాత్ ను వణికిస్తున్న వైరస్! 8 మంది మృతి! హెచ్చరికలు జారీ!

ఏపీలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టుల నిర్మాణం! మంత్రి ట్వీట్!

విద్యాదీవెన, వసతిదీవెన అమలుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! పాత విధానం అమలు!

10వ తరగతి అర్హతతో రైల్వేలో ఉద్యోగాలు! నోటిఫికేషన్ విడుదల! 2,424 అప్రెంటిస్ ఖాళీల భర్తీకి!

ఆస్ట్రేలియా: కొంపముంచిన పిక్నిక్ ప్లాన్! నీటిలో కొట్టుకుపోయిన బాపట్ల మరియు కందుకూరు విద్యార్థులు.. ఒకరిని కాపాడపోయి ఇంకొకరు కూడా!

ఇంకోసారి వాడు, వీడు అని మాట్లాడు... నీ సంగతేంటో చూస్తా! ఇప్పుడేం పీకుతావో - టీడీపీ నేత వార్నింగ్!

మీ దగ్గర రూ.500 నోట్లు ఉన్నాయా! అయితే ఒక సారి చెక్ చేసుకోండి! ఆ గుర్తు ఉంటే అవి నకిలీ నోట్లే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group