ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు మరియు తాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసి, 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. "వ్యవసాయాన్ని మరియు రైతులను కాపాడుకోవడం మా లక్ష్యం," అని మంత్రి చెప్పారు. జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖ 20 ఏళ్లు వెనక్కి లాగబడినట్లు ఆయన ఆరోపించారు. పట్టిసీమను వట్టిసీమ అని పిలిచిన జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని అన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు హయాంలో సాగునీటికి అత్యంత ప్రాధాన్యమిచ్చినట్లు గుర్తు చేశారు. ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి తూర్పు మరియు పశ్చిమ డెల్టాలకు నీటిని విడుదల చేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు వివరించారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
కలవరం రేపుతున్న అమెరికా విద్యార్ధుల మరణాలు! ఈ వారంలోనే నలుగురు!
ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్!
విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు!
అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి!
కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే?
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్!
మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: