ప్రేమించినవాడే రాక్షసుడయ్యాడు. కనీసం గర్భవతి అనే కనికరం కూడా లేకుండా కడతేర్చాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. 19 సంవత్సరాల సోనీ అనే యువతిని ఆమె ప్రియుడు సంజు అలియాస్ సలీమ్ హత్య చేశాడు. గర్భవతి అయిన సోనీ తనను పెళ్లి చేసుకోవాలని సలీమ్‌ను కోరింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్యా కొంతకాలంగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఏడు నెలల గర్భవతి అయిన సోనీ ఇటీవలే తన ఇంట్లో నుంచి కొన్ని వస్తువులు తీసుకొని ప్రియుడు సలీమ్ వద్దకు వెళ్లిపోయింది. అయితే పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేని సలీమ్ ఇద్దరు స్నేహితులను వెంటబెట్టుకొని సోనీని హర్యానాలోని రోహ్‌తక్ తీసుకెళ్లాడు. అక్కడ ముగ్గురు కలిసి ఆమెను హత్య చేశారు. మృతదేహాన్ని అక్కడే పూడ్చిపెట్టారు. సోనీ మిస్సింగ్‌పై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం బయటపడింది. సలీమ్‌తో పాటు అతడికి సాయం చేసిన ఇద్దరు స్నేహితుల్లో ఒకరిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. మరొకరు పరారీలో ఉన్నారని, అతడి కోసం గాలిస్తున్నట్టు వెల్లడించారు. నిందితుడు సలీమ్‌కు సోనీని పెళ్లి చేసుకోవడం ఇష్టంలేదని, అబార్షన్ చేయించుకోవాలని ఆమెతో గొడవ పడుతుండేవాడని తెలిసిందని పేర్కొన్నారు. కాగా పశ్చిమ ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతానికి చెందిన సోనీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేది. ఆమెకు 6,000లకు పైగా మంది ఫాలోయర్స్ ఉన్నారు. ప్రియుడు సలీమ్‌తో కలిసి ఉన్న అనేక ఫొటోలు, వీడియోలను ఆమె పోస్ట్ చేసింది. సలీమ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సోనీ ఫొటోలను షేర్ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సోనీ కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనీ కొత్తగా ఎవరితోనో స్నేహం చేస్తోందని తమకు తెలుసునని, అయితే ఎవరితో మాట్లాడుతున్నావంటే దెయ్యంతో అని చెబుతుండేదని కుటుంబ సభ్యులు తెలిపారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
నామినేటెడ్ పదవుల రెండో జాబితా విడుదలకు తెదేపా సిద్ధం! చంద్రబాబు కీలక ప్రకటన!
రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న యువ తెలుగు హీరో! మెగామేనల్లుడు ఆసక్తికర వ్యాఖ్యలు!
తాను మరణించి... ముగ్గురి జీవితాల్లో వెలుగులు నింపి! మరొకరికి ఆశను పంచిన జగదీష్ కుటుంబం!
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్! వారి ఖాతాల్లో నిధులు జమ చేసిన ఏపీ ప్రభుత్వం..!
ఏపీ ప్రజలకు శుభవార్త: విజయవాడ నుంచి హైదరాబాద్ గంటన్నరే! రికార్డులు బద్దల కొడుతున్న కూటమి ప్రభుత్వం!
రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు! నేతలతో చంద్రబాబు భేటీ - కీలక ఆదేశాలు జారీ!
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు దీపావళి బంపర్ ఆఫర్! ఉచిత గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం! 48 గంటల్లోపు నగదు జమ!
భారీ శుభవార్త చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం.. కీలక నిర్ణయం తీసుకున్న APSRTC! ఆ సమస్యకి చెక్ పెటినటే!
రూ.6 వేలకే ఐ ఫోన్, రూ.5 వేలకే ఆండ్రాయిడ్ ఫోన్.. ల్యాప్‌టాప్ రూ.15 వేలు మాత్రమే!
ముందుబాబులకు డబల్ కిక్కిచ్చే న్యూస్.. రూ.99 క్వార్టర్ వచ్చేసిందోచ్! ఒకరికి ఎన్ని ఇస్తారంటే?
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: