అమెరికా వెళ్లాలని, అక్కడ ఉద్యోగాలు చేయాలని కలలు కనే భారతీయులకు జో బైడెన్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. విదేశీ నిపుణులను మరింత సులభంగా నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పిస్తూ నిబంధనల్లో మార్పులు చేసింది. అలాగే, ఎఫ్-1 స్టూడెంట్ వీసాలను హెచ్-1బీ వీసాలుగా మార్చుకునే అవకాశం కల్పించింది. ఫలితంగా లక్షలాదిమంది భారతీయ ప్రొఫెషనల్స్‌కు ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలోని ఐటీ కంపెనీలు హెచ్-1బీ వీసా (నాన్ ఇమిగ్రెంట్) సాయంతో విదేశీ నిపుణులను నియమించుకుంటాయి. ఈ వీసా ద్వారా భారత్, చైనా దేశాలు భారీగా లబ్ధి పొందుతున్నాయి.
ఇంకా చదవండి: ఏపీలో మూడున్నర లక్షల మందికి పెన్షన్ల కట్ - వారు సేఫ్! ప్రభుత్వ తాజా నిర్ణయంతో!
ఈ నేపథ్యంలో అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ నిబంధనల్లో మార్పులు చేసి అవసరాలకు తగ్గట్టుగా విదేశీ ఉద్యోగులను నియమించుకునే అవకాశాన్ని అక్కడి కంపెనీలకు కల్పించింది. ఈ కొత్త విధానంలో లేబర్ కండిషన్ అప్లకేషన్ కచ్చితంగా హెచ్-1బీ వీసా పిటిషన్‌కు అనుగుణంగా ఉండాలి. వచ్చే ఏడాది జనవరి 17 నుంచి ఈ నిబంధన అమల్లోకి వస్తుంది. తాజా మార్పులతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను నియమించుకునే అవకాశం యజమానులకు లభిస్తుందని హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెంజాడ్రో ఎన్ మేయోర్కాస్ తెలిపారు.
ఇంకా చదవండి: కీలక నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం! కొత్త ఇళ్ల మంజూరుకు సర్వే ప్రారంభం! ఈ డాక్యుమెంట్లు రెడీ చేసుకోండి!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
టీడీపీ ఎమ్మెల్యేనా.. మజాకా? బెల్ట్ షాపులపై ఆగ్రహం! వారికి బెండు తీశారుగా..
ఏపీలో భూముల రీ సర్వేపై మంత్రి కీలక సమీక్ష.. 12 అంశాలపై! మీ భూమి – మీ హక్కు పేరుతో..
వైసీపీకి బిగ్ షాక్! ఆళ్ల నాని సైకిలెక్కేస్తున్నారా ? రేపు ఉదయం 11 గంటలకి..
H-1B వీసాలపై అమెరికా కీలక ప్రకటన.. తాజా అప్డేట్ ఇదే! భారతీయ టెక్ రంగానికి గొడ్డలిపెట్టు!
4 రోజుల పాటు కొనసాగనున్న భువనేశ్వరి పర్యటన! ఎక్కడ అంటే!
ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు హైకోర్టు గుడ్ న్యూస్! రూల్ 3(ఎ) సవరణకు గ్రీన్ సిగ్నల్!
మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు... మోహన్ బాబు భార్య సంచలన లేఖ!
ఏపీ ప్రజల కోసం మరో పథకం తెచ్చిన చంద్రబాబు! వారందరికీ ఫ్రీగా రూ.2వేల.. వైసీపీ సర్కార్ వాటిలో!
ఆ కేసులో పేర్ని నానికి బిగ్ షాక్! ఎట్టకేలకు లుక్ అవుట్ నోటీసు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: