కొడుకుని ఉన్నతంగా చూడాలనుకొన్న ఆ కన్నవారి కలలన్నీ కల్లలయ్యాయి. ఉన్నత చదువులు చదివి తమకు అండగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ప్రమాదవశాత్తు మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం, చిట్యాల గ్రామానికి చెందిన గద్దె సాయిసూర్య ఆవినాశ్ (24) అక్కడ ప్రమా దవశాత్తు జలపాతంలో జారిపడి ప్రాణాలు కోల్పోయాడు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
చిట్యాల గ్రామా నికి చెందిన గద్దె శ్రీనివాసరావు, శిరీష దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె వాసవ్యకు వివాహమైంది. కుమారుడు అవినాశ్ తాడేపల్లి గూడెంలో బీటెక్ పూర్తిచేసి గతేడాది జనవరిలో అమెరికాకు వెళ్లి అక్కడి టైన్ యూనివర్సిటీలో ఎంఎస్ చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ఈ నెల 7న న్యూయార్క్ లోని అల్యానీలో ఉన్న బార్సర్విల్లే జలపాతానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారడంతో అవినాశ్ జలపాతంలో పడిపోయి మృతి చెందాడని న్యూయార్క్ లోని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది. అతని మృతదేహాన్ని స్వగ్రామానికి పంపించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది.
ఇంకా చదవండి: రోజాలో ఏంటీ సడన్ ఛేంజ్! అడుగులు ఎటు! సోషల్ మీడియాలో భారీ ఎత్తున కామెంట్లు!
ఈ వార్త తల్లిదండ్రులకు సోమవారం తెలియడంతో వారు హతాశులైపోయారన్నారు. చిట్యాలలో విషాదచాయలు అలముకున్నాయి. తానా సభ్యులు అవినాశ్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని సమీప బంధువులు తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రానికి అవినాశ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకుంటుందని కుటుంబీకులు చెబుతున్నారు. కాగా, గత నెలలో దాసరి గోపీకృష్ణ అనే తెలుగు వ్యక్తి కూడా అమెరికాలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మరణించిన సంగతి తెలిసిందే. ఈ వారంలోనే నలుగురు తెలుగు విద్యార్థులు అమెరికాలో మరణించడం జరిగింది. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లి, తల్లిదండ్రులకు తీరని బాధను మిగిల్చడం అందరినీ కలవరపరుస్తుంది.
ఇవి కూడా చదవండి:
ట్విటర్ లో ఎంపీ సత్యకుమార్ మాస్ రాగింగ్! ఏకంగా బ్లాక్ చేసిన కేటీఆర్!
విశాఖ సీపీ దెబ్బకు వణికిపోతున్న కింది స్థాయి అధికారులు! అర్ధరాత్రి తనిఖీలు!
అజ్ఞాతంలోకి నేతలు... అయోమయంలో కార్యకర్తలు! ఇలా ఉంది వైసీపీ పరిస్థితి!
కెనడాలో ఆకాశాన్ని అంటుతున్న ఇళ్ల అద్దెలు! భారతీయులకు తిప్పలు! కారణం ఏంటంటే?
అమెరికాలో హ్యూమన్ ట్రాఫికింగ్! నలుగురు తెలుగువారు అరెస్ట్!
మాజీ షీఎం జగన్ కు టిడిపి బంపర్ ఆఫర్! ఏంటో తెలుసా!
విజయవాడలో కిడ్నీ రాకెట్ అంశంపై హోంమంత్రి అనిత ఆరా! చర్యలకు ఆదేశం!
ఏపీలోని నిరుద్యోగులకు మరో శుభవార్త! తిరుపతిలో జాబ్ ఆఫర్స్! వెంటనే అప్లై చేసేయండి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: