దక్షిణకొరియాలో తీవ్ర విషాద ఘటన జరిగింది. ప్యాసింజర్లు, సిబ్బంది కలిపి మొత్తం 181 మందితో ప్రయాణించిన ఓ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది. ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడి పేలిపోయింది. సౌత్ జియోల్లా ప్రావిన్స్‌లోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఈ ప్రమాదంలో 28 మంది మృతి చెందినట్టు తేల్చారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని తెలుస్తోంది. ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన ‘జెజు ఎయిర్ ఫ్లైట్ 2216’ ఈ ప్రమాదానికి గురైంది. ఎయిర్‌పోర్ట్ ఎమర్జెన్సీ సిబ్బంది తక్షణమే రెస్క్యూ చర్యలు ప్రారంభించి చాలా మంది ప్రయాణికులను రక్షించారు. మంటలను ఆర్పివేశారు. కాగా, విమానం ల్యాండింగ్ గేర్ పనిచేయకపోవడంతోనే విమాన ప్రమాదానికి కారణమని స్థానిక మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. విమానం ల్యాండ్ అయ్యి రన్‌పై కొద్దిదూరం ప్రయాణించిన తర్వాత ఒక్కసారిగా పొగలు వెలువడి పెద్ద పేలుడు సంభవించి మంటలు ఎగసిపడ్డాయి. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 181 మంది ఉండగా వారిలో 175 మంది ప్యాసింజర్లు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నారు.
ఇంకా చదవండి: నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! ఆ కార్పొరేషన్ నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష! ఆరోగ్యశ్రీ లో కీలక మార్పులు - అమలు ఇక ఇలా!
నేను ఈ వ్యక్తికి ఫ్యాన్ అయ్యాను.. సోషల్ మీడియాలో వైరల్.. లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఏపీలో సంక్రాంతి సెలవులు ఎప్పటినుంచంటే? కొన్ని జిల్లాల్లో విద్యా సంస్థలకు!
మహిళలకు చంద్రబాబు గుడ్ న్యూస్! వారికి ఉచిత శిక్షణ మరియు కుట్టు మిషన్! ఎప్పటి నుంచి అంటే!
ఏపీలో మందుబాబులకు ఫుల్లు కిక్కు.. ఇకపై అన్ని బ్రాండ్లు రూ. 99కే! ప్రభుత్వ నిర్ణయంతో..
అలర్ట్: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి కష్టాలే! అవసరమైతేనే ఇళ్లల్లో నుంచి బయటకు రాదు!
ఏపీలో రిజిస్ట్రేషన్ల జోరు.. ఆ నిర్ణయం వాయిదా.. కార్యాలయాలకు భారీగా వస్తున్న ప్రజలు!
వైకాపాకు మరో బిగ్ షాక్! మరియమ్మ హత్య కేసులో... 34 మంది అరెస్టు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: