బిజీ లైఫ్ షెడ్యూల్, వర్క్ అండ్ మెంటల్ టెన్షన్స్, అన్హెల్తీ హాబిట్స్.. ఇలా కారణాలేవైనా ఇటీవల అధిక రక్తపోటు సమస్యను చాలా మంది ఎదుర్కొంటున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా ఎవరైనా దీని బారిన పడే అవకాశాలు పెరగుతున్నాయి. అయితే బీపీ అనేక ఇతర రోగాలకు దారితీస్తుంది కాబట్టి అదుపులో ఉంచుకునే మార్గాలు అనుసరించాలంటున్నారు నిపుణులు. అయితే ఆహారాలు, మందులు, సాధారణ వ్యాయామాలతో పలు యోగాసనాలు బ్లడ్ ప్రెజర్ను కంట్రోల్లో ఉంచడంలో సహాయపడతాయని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు. అవేంటో చూద్దాం.
విపరీత కరణి ఆసనం: బ్లడ్ ప్రెజర్ లేదా అధిక రక్తపోటును తగ్గించడంలో 'విపరీత కరణి' యోగాసనం సహాయపడుతుందని యోగా నిపుణులు చెప్తున్నారు. దీనివల్ల శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మరింత మెరుగు పడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. బాడీ మొత్తం రిలాక్స్ అవుతుంది. ఇక ఆసనం ఎలా వేయాలనే విషయానికి వస్తే ముందుగా వీపును నేలకు ఆనించి, తర్వాత గోడను సపోర్ట్గా చేసుకొని రెండు పాదాలు పైకి ఎత్తాలి. నడుము భాగానని కాస్త పైకి ఎత్తి దాని కింది భాగంలో రెండు చేతులను సపోర్ట్గా పెట్టాలి.
ఇంకా చదవండి: ఆమెకు ఆ అరబి కుటుంబం దేవుడుతో సమానం! పొగడ్తల తో ముంచేత్తుతున్న తెలుగు ఆడ పడుచు! ఇంతకీ ఆమెకు ఏమి జరిగిందంటే! 14
సుఖాసనం: అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడే మరో ఆసనం. సుఖాసనం. దీని కారణంగా మెదడుకు రక్త ప్రసరణ మెరుగవుతుంది. రిలాక్గా అనిపిస్తుంది. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకోసం ముందుగా నేలపై ప్రశాంతంగా కూర్చోవాలి. వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఆ తర్వాత కళ్లు మూసుకొని, శ్వాసపై ధ్యాస ఉంచుతూ.. లోతైన శ్వాస పీల్చుతూ.. వదులుతూ ఉండాలి.
బాలాసనం: బీపీని కంట్రోల్లో ఉంచడంలో బాలాసనం అద్భుతంగా పనిచేస్తుంది. అలసట, ఆందోళన, మానసిక ఒత్తిడి, టెన్షన్స్ వంటివి తగ్గిపోతాయి. రోజూ చేయడంవల్ల అధిక రక్తపోటు అదుపులో ఉండటమే కాకుండా అనేక రోగాల ముప్పు తగ్గుతుంది. ఇందుకోసం ముందుగా మోకాళ్లపై కూర్చోవాలి. తర్వాత ముందుకు వంగి రెండు చేతులనూ చాపాలి. అరచేతులతోపాటు తలను కూడా నేలకు ఆనించాలి. పిల్లలు బోర్లా పడుకున్నట్లుగా ఉండే ఈ ఆసనం మీలో మానసిక ప్రశాంతతను పెంచుతుంది.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పశ్చిమోత్తాసనం: రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి పశ్చిమోత్తాసనం సహాయపడుతుంది. దీనివల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. బీపీ కంట్రోల్లో ఉంటుంది. ముందుగా కింద కూర్చొని, రెండు పాదాలను ముందుకు చాపాలి. ఆ తర్వాత ముందుకు వంగి కాలి వేళ్లను, రెండు చేతులతో పట్టుకోవాలి. ముఖాన్ని మోకాళ్లను తాకేలా ఆనించాలి. ఇలా రోజూ ప్రాక్టీస్ చేస్తే బ్లడ్ ప్రెజర్ సమస్యే ఉండదు.
జాను శీర్షాసనం: ఆందోళన, ఒత్తిడిని తగ్గించడంలో జాను శీర్షాసనం మేలు చేస్తుంది. ఈ యోగాసనం బీపీని అదుపులో ఉంచుతుంది. మెదడును రిలాక్స్ అయ్యేలా ప్రేరేపిస్తుంది. ఆసనం కోసం ముందుగా కింద కూర్చొని, ఒక కాలు ముందుకు చాపాలి. రెండు చేతులతో అలా చాపిన కాలి చివరి భాగాన్ని పట్టుకోవాలి. ఆ సమయంలో తల మోకాలి మీదుగా ఉండాలి. ఇలా 5 పర్యాయాలు చేసిన తర్వాత మరో కాలిని ముందుకు చాపి ఆసనం వేయాలి. దీంతోపాటు కింద పడుకొని శ్వాసమీద ధ్యాసను కేంద్రీకరించే శవాసనం కూడీ బీపిని అదుపులో ఉంచుతుంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
కొత్త సంవత్సరం నుంచి ఈ రేషన్ కార్డులు చెల్లవు! వెంటనే ఇలా చేయండి - వారి కార్డులు రద్దు!
అన్నీ శుభవార్తలే... ఏపీకి అదృష్టంగా మారిన కేంద్రమంత్రి! ఆ జిల్లాల్లో పెరగనున్న స్థలాల రేట్లు!
ఆ మహిళ చేసిన పనికి బిత్తర పోయిన చంద్రబాబు! మరీ అంత దారుణంగానా!
రాష్ట్రంలో బెల్ట్ షాపులు.. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం? వారిలో ఇద్దరు, ముగ్గురిని నడి రోడ్డుపై ఉరి!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: