తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నరేష్, పవిత్రా లోకేష్ మధ్య ప్రేమ పుట్టడంపై అందరూ ఆశ్చర్యపోయారు. లేటు వయసులో ఘాటు రొమాన్స్ అవసరమా? అనేవారు కూడా ఎందరో ఉన్నారు. కానీ ఇటువంటి విమర్శలను వారు పట్టించుకోలేదు. కొద్దిరోజులు ప్రేమించుకున్న తర్వాత వివాహం చేసుకొని అందరికీ గుండెపోటు వచ్చేంత షాక్ ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో వీరిద్దరి వివాహం సంచలనాన్ని కలిగించింది. అప్పటికే పెళ్లిళ్లలో నరేష్ హ్యాట్రిక్ కొట్టాడు. వీరిద్దరిపై నరేష్ మూడో భార్య రమ్యరఘుపతి కేసు పెట్టింది. ఈ జంట లిప్ లాక్ పెట్టుకున్న ఎన్నో వీడియోలు బయటకు వచ్చాయి. అయితే అదంతా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేశారు. మళ్లీపెళ్లి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పిల్లల్ని కంటామని చెప్పారు.
ఇంకా చదవండి: అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పవిత్ర-నరేష్ అందరికీ షాకిచ్చేలా కామెంట్లు చేశారు. తాము పిల్లల్ని కనాలనుకోవడంలేదని, ఇప్పటికే ఉన్న పిల్లలు తమ పిల్లలేనని ప్రకటించారు. తమ ఆస్తి వారికే చెందుతుందన్నారు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఏంటి.. వీళ్లిద్దరూ ఇలా మారిపోయారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. పిల్లల్ని కనే విషయంలో ఇద్దరి మధ్య ఏమైనా విభేదాలు తలెత్తాయా? కొద్దిరోజులు కలిసివుండి తర్వాత విడిపోవాలనుకుంటున్నారా? అంటూ చర్చించుకుంటున్నారు. నరేష్ వద్ద రూ.1500 కోట్ల ఆస్తి ఉండటంతోనే అతనితో సహజీవనం చేస్తోందని, అంత డబ్బు ఉండటమే కారణమని పవిత్ర మాజీ భర్త ఆరోపించారు.
ఇంకా చదవండి: ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
చంద్రబాబు ఆదేశాలతో ఎన్టీఆర్ భవన్ కు వచ్చిన మంత్రులు! ఎందుకో తెలుసా?
ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
కువైట్ ఎడారిలో ఒక తెలుగు ప్రవాసుడి ఆవేదన! ఎవరూ స్పందించకపోతే ఆత్మహత్యే దిక్కు!
చాక్లెట్ ఇప్పిస్తానాని, చిన్నారిపై లైంగిక దాడి ! వైద్యులు ఏం చెప్పారంటే!
అది శంకర్ 'భారతీయుడు' .. మరి ఇది? పబ్లిక్ టాక్! నిన్ననే థియేటర్లలో విడుదలైన సినిమా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: