భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోం ది. అందులో భాగంగా సాంకేతికతను వినియోగించి త్వరగా దర్శనం పూర్తయ్యేలా కార్యాచరణ కు శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ దిశగా పైలెట్ ప్రాజెక్టు అమలు చేస్తోంది. అమల్లో ఎదురయ్యే సమ స్యలను గుర్తించే ప్రక్రియ చేపట్టింది. ఇబ్బందులు లేకుండా అమలు చేసేందుకు అధ్యయనం చేస్తోంది. ఎలాంటి సమస్య లేకుండా పూర్తి స్థాయిలో అమలు చేయాలని డిసైడ్ అయింది. దీని ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం ఇక గంట నుంచి మూడు గంటల్లోనే పూర్తవుతుందని అంచనా. టీటీడీ కీలక నిర్ణయం అమలుకు సిద్దం అవుతోంది. భక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తో దర్శన టోకెన్ పొందడం, తిరిగి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని ప్రవేశించేందుకు ఫేస్ రికగ్నిషన్ ఎంట్రీ విధానాన్ని తీసుకు రావాలని నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించి డెమో ప్రక్రియ కూడా పూర్తయింది. శ్రీవారి దర్శనం కోసం రద్దీ రోజుల్లో గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సి వస్తోంది. దీనికి ముగింపు పలికి ఇక నుంచి గంట నుంచి మూడు గంటల్లోనే దర్శనం పూర్తయ్యేలా కొత్త కార్యాచరణ సిద్దం చేస్తోంది.
ఇంకా చదవండి: పీఆర్, పర్సనల్ మేనేజర్ ను తొలగించిన చిరంజీవి! దీనిపై ఆరా తీయగా..
టీటీడీ ప్రతిపాదన మేరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో నైపుణ్యం ఉన్న సంస్థలు అధికారులతో సంప్రదింపులు చేస్తున్నాయి. రెండు సంస్థలు ఇప్పటికే తమ ప్రతిపాదనలను టీటీడీ ముందు ఉంచాయి. ఏఐ విధానం అమలు పైన తమ ప్రజెంటేషన్ ఇచ్చాయి. దీని ద్వారా భక్తుల కోసం ఫేస్ రిగక్నైజేషన్ రికార్డ్‌తో పాటు కియోస్కి మిషన్ స్లిప్ జనరేట్ చేసేలా కొత్త విధానం అందు బాటు లోకి తీసుకొస్తున్నారు. భక్తుడుకు అందే ఆ స్లిప్‌లో కేటాయించిన సమయానికి తిరుమలకు రావాల్సి ఉంటుంది. ఆ సమయంలో భక్తులు ఫేస్ రీడింగ్ ద్వారా లేదా బార్ కోడ్ స్లిప్ స్కాన్ ద్వారా దర్శనానికి అనుమతించేలా కొత్త విధానం పైన కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టు పరిశీలన కోసం కొత్తగా 45 యంత్రాలను సమకూర్చుతున్నారు. పూర్తి స్థాయిలో అధ్యయనం జరిగిన తరువాత అమల్లో ఎదురైన అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని అమలు చేయాలని టీటీడీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. అదే సమయంలో తిరుమలలో వసతి విషయంలోనూ కీలక మార్పులకు టీటీడీ కసరత్తు చేస్తోంది. సబ్ ఎంక్వైరీ కార్యాలయాల ఏర్పాటు ద్వారా కరెంట్ బుకింగ్ సులభతరం చేయాలని నిర్ణయించింది. దీంతో, త్వరలోనే భక్తులకు దర్శనం తో పాటుగా వసతి విషయంలోనూ కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ఇంకా చదవండి: అమెరికాలో మరో ఘోర ప్రమాదం! ఊహించని విధంగా తెలుగు విద్యార్ధి మృతి! ఇలా కూడా జరుగుతుందా అనే రీతిలో! మరో ఇద్దరు క్షేమం!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సీఎం చంద్రబాబు పీఏ పేరుతో మోసం.. మాజీ క్రికెటర్‌పై కేసు నమోదు!
అమరావతికి రూ.11వేల కోట్ల హడ్కో రుణం... సీఎండీతో చర్చించిన మంత్రి! దిల్లీలో కీలక భేటీలు!
నామినేటెడ్ డైరెక్టర్స్ లిస్టు! 13 కార్పొరేషన్ ల నియామక జీవో జారీ! పూర్తి లిస్ట్ మీ కోసం!
ఏపీఎస్డీఎంఏ: రెండ్రోజుల పాటు వర్షాలు! బలపడిన అల్పపీడనం అదే ప్రాంతంలో..
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో మరో మలుపు! ఏ18గా మైత్రీ మూవీస్... నిందితుల జాబితా ఇదే!
రెండు సిమ్ కార్డులు వాడుతున్నారా? ఇది తెలిస్తే ఎగిరి గంతేస్తారు! కీలక ఆదేశాలు - అది ఏమిటంటే!
విమానం టికెట్ ఇంత తక్కువకా.. ఇండిగో బంపర్ ఆఫర్! ఎయిర్‌లైన్ సూచనలు ఇవే!
ఐదు అంతస్తుల వరకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు! పురపాలక శాఖ మంత్రి నారాయణ కీలక ప్రకటన!
బీసీ సంక్షేమానికి ముఖ్యమంత్రి కీలక నిర్ణయాలు! ప్రత్యేక రక్షణ చట్టంపై...!
బిగ్ అలర్ట్.. ఫోన్‌పే లేదా గూగుల్ పే వాడుతున్నారా? జనవరి కొత్త రూల్స్, తప్పక తెలుసుకోవాల్సిందే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: