శ్రీవారి భక్తుల సౌకర్యార్థం తితిదే మార్చి 2025కు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అష్టదళపాద పద్మారాధన సేవల ఆర్జిత సేవా టికెట్ల కోటాను ఈ నెల 18వ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది. వీటిలోనే లక్కీడిప్ కోటా కోసం 20వ తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. *ఈనెల 21వ తేదీ ఉదయం పది గంటలకు కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్రదీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. వర్చువల్ సేవా టికెట్లను అదేరోజు మధ్యాహ్నం మూడు గంటలకు అందుబాటులో ఉంచుతారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఈనెల 23వ తేదీ ఉదయం పది గంటలకు అంగ ప్రదక్షిణం కోటా, ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శనం కోటా, మధ్యాహ్నం మూడు గంటలకు వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్ల కోటా విడుదల ఉంటుంది. ఈనెల 24వ తేదీ ఉదయం పది గంటలకు మార్చి 2025 ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్ల కోటా విడుదల చేస్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల, తిరుపతిలో అద్దె గదుల బుకింగ్ ఉంటుంది. * ఈనెల 27న మార్చి నెల శ్రీవారి సేవ కోటా విడుదల చేస్తారు. భక్తులు గమనించి https://ttdevasthanams. ap.gov.inలో ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
2025 ఏడాదికి ఏపీ సర్కార్ సెలవుల జాబితా విడుదల! 21 ఐచ్ఛిక సెలవులు..
ఏపీలో కొత్త యూనివర్సిటీ.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! ఎక్కడ అంటే?
ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
కావాలని కొట్టలేదు - ఐయామ్ సారీ! జర్నలిస్ట్ సంఘాలకి క్షమాపణలు.. వెంట విష్ణు కూడా..
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: