సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఎట్టకేలకు జర్నలిస్ట్ సమాజానికి బహిరంగ క్షమాపణలు చెప్పారు. గత మంగళవారం జల్‌పల్లిలో మంచు మనోజ్ వెంట మోహన్ బాబు ఇంట్లోకి వెళ్లిన జర్నలిస్ట్ రంజిత్.. ఇష్యూపై మోహన్ బాబు స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించారు. కానీ.. మోహన్ బాబు క్షణికావేశంలో జర్నలిస్ట్ వద్ద నుంచి మైక్ అందుకుని అతడిపై దాడి చేశారు. దాంతో.. గాయాలతో ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోదా ఆసుపత్రిలో జర్నలిస్ట్ చికిత్స పొందుతున్నారు. మోహన్ బాబు చర్యని ఖండిస్తూ జర్నలిస్ట్ సంఘాలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ.. నిరసనలు తెలియజేశాయి. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి.
ఇంకా చదవండి: ఆర్జీవీ నోటి దూల తగ్గలా.. రేవంత్ రెడ్డి పై కారు కూతలు!
మరోవైపు మోహన్ బాబుపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణకి హాజరవుకుండా మోహన్ బాబు కాలయాపన చేస్తున్నారు. అయితే.. ఐదు రోజుల నిరీక్షణ తర్వాత ఎట్టకేలకి మోహన్ బాబు దిగొచ్చారు. యశోద ఆసుపత్రికి ఆదివారం వెళ్లిన మోహన్ బాబు.. జర్నలిస్ట్ రంజిత్‌ను పరామర్శించి క్షమాపణలు చెప్పారు. అక్కడే ఉన్న అతని కుటుంబ సభ్యులకి కూడా క్షమాపణలు చెప్పి.. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఇదే క్రమంలో దాడిపై జర్నలిస్ట్ సంఘాలకి కూడా క్షమాపణలు చెప్పాలని జర్నలిస్ట్ కోరడంతో.. మోహన్ బాబు బహిరంగ క్షమాపణలు కోరారు. మోహన్ బాబు వెంట ఆసుపత్రికి మంచు విష్ణు కూడా వెళ్లారు.
ఇంకా చదవండి: పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్! వారికి నామినేటెడ్ పదవులు కూడా కష్టమే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
రఘురామకృష్ణ చిత్రహింసల కేసులో కిలక మలుపు! గుంటూరు జీజీహెచ్లో...!
వైకాపా మాజీ ఎంపీ హౌస్ అరెస్ట్ సంచలనం! పులివెందులలో పోలీసుల ప్రత్యేక నిఘా!
18 వేల మందికి అమెరికా డీపోర్టేషన్! ఆందోళనలో భారతీయులు! టాప్ కేటగిరి తెలుగు వారే!
మోహన్ బాబుకు హైకోర్టులో చుక్కెదురు! అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం!
ఏపీ ప్రజలకు అలర్ట్.. ఇక వారికే పెన్షన్లు - అలా కట్ చేయండి! కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: