రుతుపవనాలు మరింత బలపడటంతో రాష్ట్రంలో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలో రైతులకు, మత్స్యకారులకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురువనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 17 వరకు వర్షాలు కొనసాగుతాయని పేర్కొంది. నేడు మన్యం, అనకాపల్లి, ఏలూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని అంచనా వేసింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి:
మహారాష్ట్ర సీఎం తో చంద్రబాబు భేటీ! కీలక అంశాలపై చర్చ!
ఏపీలో ఒకేసారి 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ! ఆ వివరాలు మీకోసం!
ఈ దేశాల్లో ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఆదాయం ఎంతున్నా ఎవరూ అడగరు! ఆహా ఎంత అదృష్టమో!
రాజస్థాన్ లో ఫేక్ డీగ్రీ స్కామ్! 43 వేల ఫేక్ డిగ్రీలు జారీ! దర్యాప్తు ప్రారంభం!
బీజేపీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం! క్లారిటీ ఇచ్చిన గులాబీ పార్టీ!
నాకు ఆయనే ప్రాణభిక్ష పెట్టారు! సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: