మహాలయ విశిష్టత తెలియజేసి శుభాకాంక్షలు తెలిపిన మోడీ!

PM Modi’s Mahalaya Wishes: మహాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, కరుణ, సహనం, ఆశలు నిండాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని కోరుకున్నారు.

PM Modi’s Mahalaya Wishes to People
PM Modi’s Mahalaya Wishes to People
  • మహాలయ పర్వదినం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
  • ప్రధాని మోదీ ఎక్స్‌ (X) వేదికగా తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు.

PM Modi’s Mahalaya Wishes: మహాలయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం, కరుణ, సహనం, ఆశలు నిండాలని ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా శాంతి, సౌభాగ్యం, సమృద్ధి వెల్లివిరియాలని కోరుకున్నారు.

ఎక్స్ వేదికగా మూడు భాషల్లో శుభాకాంక్షలు

మహాలయ సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌ (X)లో ప్రత్యేక సందేశాన్ని పంచుకున్నారు. తెలుగు, ఇంగ్లీష్, బెంగాలీ భాషల్లో ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. మా దుర్గా దేవి కృపతో సమాజంలో సుఖసంతోషాలు పెరగాలని, ప్రజల మధ్య దయ, సహనం, సానుకూలత మరింత బలపడాలని ఆకాంక్షించారు.

పితృ పక్షానికి ముగింపు.. దుర్గా పూజకు ఆరంభం

హిందూ సంప్రదాయంలో మహాలయకు విశేష ప్రాధాన్యం ఉంది. పూర్వీకులకు తర్పణాలు, శ్రాద్ధకర్మలు నిర్వహించే పితృ పక్షం ఈ రోజుతో ముగుస్తుంది. అనంతరం దుర్గా పూజ, దేవీ శరన్నవరాత్రుల సందడి మొదలవుతుంది. దుర్గాదేవి భూలోకానికి విచ్చేసే సందర్భానికి ప్రతీకగా మహాలయను భక్తులు భావిస్తారు. ఈ పర్వదినంతో దేశంలోని పలు ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది.

అస్సాంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు

మహాలయ సందర్భంగా అస్సాంలోని జోర్హాట్‌ సహా పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే భక్తులు పెద్ద సంఖ్యలో వీధుల్లోకి వచ్చారు. భజనలు, ప్రత్యేక పూజలతో దుర్గామాతకు స్వాగతం పలికారు. ఆలయాలు, పూజా ప్రాంగణాల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మహాలయతో ప్రారంభమైన ఈ పండుగ వాతావరణం రానున్న రోజుల్లో దుర్గా పూజ వేడుకలతో మరింత ఉత్సాహంగా మారనుంది.

Tags

Be the first to react

Latest