ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త అవకాశాలను తెరిచినప్పటికీ, అదే టెక్నాలజీ ఇప్పుడు అనేక సమస్యలకు కారణమవుతోంది. ముఖ్యంగా సినీ తారలను లక్ష్యంగా చేసుకుని తయారు చేస్తున్న డీప్‌ఫేక్ వీడియోలు, మోర్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన నకిలీ విజువల్స్ వినాయిత్యానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. తాజాగా ఈ సమస్యను బహిరంగంగా మాట్లాడారు రష్మిక మందన్న టాలీవుడ్, బాలీవుడ్ రెండింటిలోనూ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న రష్మిక, మహిళలను లక్ష్యంగా చేసుకుని AI దుర్వినియోగం పెరుగుతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
రష్మిక తన అధికారిక X (Twitter) ఖాతా ద్వారా శక్తివంతమైన సందేశాన్ని ఇచ్చారు. ఇంటర్నెట్ ఇకపైనా నిజానికి అద్దం కాదు, అబద్ధాలను సైతం నమ్మించే శక్తి ఉన్న స్థలంగా మారిందని ఆమె గట్టిగా పేర్కొన్నారు. నిజాన్ని వక్రీకరించే సామర్థ్యం AIకి ఉన్నప్పటికీ, దానిని మంచికి కాకుండా మహిళలను అవమానించే దిశగా ఉపయోగించడం సమాజంలోని నైతికత పడిపోతున్న సంకేతమని నటీమణి స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా మహిళలపై దాడులు మరింత పెరుగుతున్నాయనే విషయాన్ని ప్రస్తావించిన రష్మిక, “AI ఉపయోగించి అసభ్యకర కంటెంట్ సృష్టించే పనులు అనేవి కేవలం చట్ట విరుద్ధమే కాదు, మానవత్వానికి వ్యతిరేకం. ఇలాంటి పనులు చేసే వ్యక్తులు కఠినమైన, క్షమించరాని శిక్షల్ని ఎదుర్కోవాల్సిందే” అని పేర్కొన్నారు. ఆమె అభిప్రాయం ప్రకారం, బాధితుల జీవితాలను దెబ్బతీసే ఇలాంటి విజువల్స్ కొన్ని సెకండ్లలోనే వైరల్ అవుతాయి, కానీ ఆ మానసిక గాయం సంవత్సరాల తరబడి పోదు.
ఇంటర్నెట్‌లో ఫేక్ విజువల్స్ నిజం లాగానే కనిపిస్తున్నాయనీ, అందువల్ల సమాజం డిజిటల్ బాధ్యతను నేర్చుకోవాల్సిన సమయం ఇదేనని రష్మిక పేర్కొన్నారు. AI ఒక గొప్ప సాధనం అయినప్పటికీ, దానిని నియంత్రణ లేకుండా వదిలేస్తే అది పెద్ద ప్రమాదాన్ని తీసుకురావొచ్చని ఆమె హెచ్చరించారు. మహిళల గౌరవం, భద్రత కోసం ప్రభుత్వం కఠిన చట్టాలు తీసుకురావాలని కూడా ఆమె సూచించారు.
ఇక పని విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం ‘Cocktail 2’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2012లో వచ్చిన ‘Cocktail’ సినిమా భారీ విజయాన్ని సాధించగా, దాని సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో పెద్ద ఆసక్తి కనిపిస్తోంది