LIVE
Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  •  Vishaka: ప్రభుత్వ స్కూల్‌గా మారిన విశాఖ విమల విద్యాలయం.. కలెక్టర్, ఎమ్మెల్యే పల్లా చేతుల మీదుగా ప్రారంభం!  •  6G Network: భారత్‌లో 6G సంచలనం.. టెలికాం రంగం రూపురేఖలు మార్చబోతున్న కేంద్ర ప్రభుత్వ మాస్టర్ ప్లాన్!  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Lifestyle

Hajj: విజయవాడలో నుండి 156 మంది హజ్ యాత్రికుల ప్రయాణం..

Hajj: విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్ర తొలి దశ ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర యాత్ర కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాత్రికులు ఆనందంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

AndhraPravasi News Desk 1 min read
Hajj: విజయవాడలో నుండి 156 మంది హజ్ యాత్రికుల ప్రయాణం..

విజయవాడ ఎంబార్కేషన్ నుంచి తొలిదశ హజ్‌యాత్ర ప్రారంభం..

జెండా ఊపి హజ్‌యాత్ర ప్రారంభించిన మంత్రులు ఫరూక్, కొల్లు రవీంద్ర..

విజయవాడ ఎంబార్కేషన్ కేంద్రం నుంచి హజ్ యాత్ర తొలి దశ ఘనంగా ప్రారంభమైంది. పవిత్ర యాత్ర కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యాత్రికులు ఆనందంతో తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. తొలి దశలో మొత్తం 156 మంది యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరారు.

ఈ సందర్భంగా మంత్రులు ఫరూక్ మరియు కొల్లు రవీంద్ర జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. యాత్రికులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి ప్రయాణం సాఫీగా సాగాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులు, బంధువులు యాత్రికులను భావోద్వేగంగా వీడ్కోలు పలికారు. కొందరి కళ్లలో ఆనందం, మరికొందరిలో భక్తి ఇలా ఎన్నో భావాలు.

హజ్ యాత్ర అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైనది. జీవితంలో ఒక్కసారైనా ఈ యాత్ర చేయాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతుంటారు. అలాంటి యాత్రకు బయలుదేరిన ఈ యాత్రికుల ముఖాల్లో కనిపించిన ఆనందం ప్రత్యేకంగా నిలిచింది.

ఇక రెండో దశలో రేపు మరో 177 మంది యాత్రికులు హజ్ యాత్రకు బయలుదేరనున్నారు. ఈ ఏర్పాట్లన్నీ అధికారులు సమగ్రంగా నిర్వహించారు. యాత్రికులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. మొత్తానికి విజయవాడ నుంచి ప్రారంభమైన ఈ హజ్ యాత్ర భక్తి, ఆనందం, ఆశల మేళవింపుగా మారింది. యాత్రికులు సురక్షితంగా వెళ్లి తిరిగి రావాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

Be the first to react

More Coverage

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా గమనించారా? రోడ్డు పక్కన ఉండే ఆకుపచ్చ బోర్డుల వెనుక ఇంత పెద్ద సైన్స్ ఉందా? తెలిస్తే అబ్బా అంటారు!

Highway Signboards: మీరు ఎప్పుడైనా హైవేలపై ప్రయాణించినప్పుడు రోడ్డు పక్కన లేదా పైన ఉండే బోర్డులను గమ…

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: కొరియాలో ఉద్యోగం అంత కష్టమా? ‘భారతీయులెవరూ ఇక్కడికి రావద్దు’ అంటూ యువతి వైరల్ వీడియో!

South Korea: దక్షిణ కొరియాలో ఉద్యోగం చేయాలనుకుంటున్న భారతీయులను హెచ్చరిస్తూ ఓ యువతి పోస్ట్ చేసిన వీడ…