Apple: భారత్‌లో ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ధరలు పెంపు.. కొత్త టారిఫ్‌లు అమల్లోకి!
Apple: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ భారత్‌లో తన ఆపిల్ మ్యూజిక్ మరియు ఆపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచింది. కొత్తగా సేవలను తీసుకునే వినియోగదారులతో పాటు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికీ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. సవరించిన ధరలు ఇప్పటికే ఆపిల్ ప్లాట్‌ఫారమ్‌లలో అమల్లోకి వచ్చాయి.
ఆపిల్ వినియోగదారులకు షాక్.. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలు పెరిగాయి..
మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చుల పెరుగుదలతో ఆపిల్ ధరల సవరణ..
న్యూఢిల్లీ: ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ (Apple) భారత్‌లో తన ఆపిల్ మ్యూజిక్ మరియు ఆపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ల ధరలను పెంచింది. కొత్తగా సేవలను తీసుకునే వినియోగదారులతో పాటు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారికీ ఈ పెరిగిన ధరలు వర్తిస్తాయి. సవరించిన ధరలు ఇప్పటికే ఆపిల్ ప్లాట్‌ఫారమ్‌లలో అమల్లోకి వచ్చాయి.
సంగీత ప్రసార సేవలను అందించడానికి రికార్డ్ లేబుళ్లు, సంగీత ప్రచురణ సంస్థలు, కళాకారులకు చెల్లించాల్సిన మ్యూజిక్ లైసెన్సింగ్ ఖర్చులు గణనీయంగా పెరగడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆపిల్ తెలిపింది. అయితే ధరలు పెంచినప్పటికీ, వినియోగదారులకు కొత్త ఫీచర్లు లేదా అదనపు ప్రయోజనాలు ఏవీ ప్రకటించలేదు.
Apple Music కొత్త ధరలు ఇవే
ఆపిల్ మ్యూజిక్ ఇండివిడ్యుయల్ ప్లాన్ నెలకు రూ.119 నుంచి రూ.139కు పెరిగింది.
స్టూడెంట్ ప్లాన్ ధర రూ.59 నుంచి రూ.69కు చేరింది.
అత్యధిక పెంపు ఫ్యామిలీ లాన్లో కనిపించింది. ఈ ప్లాన్ ధర రూ.179 నుంచి రూ.229కు పెరిగింది. ఈ ప్లాన్ ద్వారా ఒకే కుటుంబంలోని ఆరుగురు సభ్యులు ఆపిల్ ఫ్యామిలీ షేరింగ్ సదుపాయంతో విడివిడిగా తమ సంగీత లైబ్రరీలు, ప్లేలిస్టులు, వ్యక్తిగత సిఫార్సులను ఉపయోగించుకోవచ్చు.
ఆపిల్ మ్యూజిక్ తో పాటు ఆపిల్ TV+, ఆపిల్ ఆర్కేడ్, iCloud వంటి సేవలను ఒకే సబ్‌స్క్రిప్షన్‌లో అందించే ఆపిల్ వన్ ప్లాన్‌ల ధరలను కూడా కంపెనీ సవరించింది.
ఇండివిడ్యుయల్ ప్లాన్: రూ.175 నుంచి రూ.195
ఫ్యామిలీ ప్లాన్: రూ.365 నుంచి రూ.445
ప్రీమియర్ ప్లాన్: రూ.499 నుంచి రూ.595
వినియోగదారులు ఎంచుకునే iCloud స్టోరేజ్ సామర్థ్యాన్ని బట్టి మొత్తం ఖర్చులో మార్పులు ఉండొచ్చని కంపెనీ పేర్కొంది.
భారత్ మాత్రమే కాకుండా అమెరికా, బ్రిటన్, యూరప్ వంటి పలు దేశాల్లో కూడా ఆపిల్ మ్యూజిక్, ఆపిల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ధరలను ఆపిల్ పెంచినట్లు సమాచారం. అయితే ఈ ధరల సవరణలపై ఆయా దేశాలకు సంబంధించి కంపెనీ అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.
సబ్‌స్క్రిప్షన్ ధరల పెంపుకు ముందు ఆపిల్ తన Mac, MacBook, iPad, Apple TV, HomePod వంటి పలు ఉత్పత్తుల ధరలను కూడా పెంచింది. ప్రపంచవ్యాప్తంగా మెమరీ చిప్‌ల కొరత కారణంగా విడిభాగాల ధరలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది. అలాగే జపాన్‌లో iPhone 16, iPhone 17 సిరీస్ ఫోన్ల ధరలను కూడా ఇటీవల పెంచినట్లు నివేదికలు వెల్లడించాయి.
కొత్త ధరలతో ఆపిల్ సేవలను వినియోగించే లక్షలాది మంది భారతీయ వినియోగదారులపై నెలవారీ ఖర్చు మరింత పెరగనుంది. ముఖ్యంగా Family, Premier ప్లాన్‌లను ఉపయోగించే కుటుంబాలు, అధిక సేవలు వినియోగించే వినియోగదారులపై ఈ ధరల పెంపు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Be the first to react