LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Padma Awards: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేడు పద్మా అవార్డుల ప్రదానం!

Padma Awards: భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు.

AndhraPravasi News Desk 1 min read
Padma Awards: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా నేడు పద్మా అవార్డుల ప్రదానం!

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమం..

66 మంది ప్రముఖులకు నేడు పద్మ పురస్కారాలు..

భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డుల ప్రధానోత్సవం ఈరోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరగనుంది. రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తొలి సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను ఈ అవార్డులతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తోంది.

ఈరోజు జరిగే తొలి విడత కార్యక్రమంలో మొత్తం 66 పద్మ అవార్డులు అందజేయనున్నారు. వీటిలో 2 పద్మ విభూషణ్, 6 పద్మ భూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. మిగిలిన అవార్డులను తర్వాత నిర్వహించే రెండో విడత సివిల్ ఇన్వెస్టిచర్ కార్యక్రమంలో ప్రదానం చేయనున్నారు.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించింది. అందులో 5 పద్మ విభూషణ్, 13 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు ఉండగా, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించడం ప్రత్యేకతగా నిలిచింది.

1954లో ప్రారంభమైన పద్మ అవార్డులు ప్రతి ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర సాంకేతిక రంగం, ప్రజా వ్యవహారాలు, వాణిజ్యం వంటి అనేక రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన వారికి ఈ గౌరవాన్ని అందజేస్తారు.

దేశ అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి సత్కరించడం ద్వారా యువతకు స్ఫూర్తినివ్వడమే ఈ అవార్డుల ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీతల కుటుంబ సభ్యులు హాజరుకానున్నారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…