LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య తర్వాత అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు!

Hyderabad: హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలో పని చేసే నేపాలీ పని మనుషుల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.

AndhraPravasi News Desk 1 min read
Hyderabad: రిటైర్డ్ ఐపీఎస్ భార్య హత్య తర్వాత అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు!

హైదరాబాద్ పోలీసులు కీలక ప్రకటన..

నేపాలీలు పనిచేస్తున్న ఇళ్లకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..

హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు నేపథ్యంలో నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇళ్లలో పని చేసే నేపాలీ పని మనుషుల వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. భద్రతా పరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

నగరంలోని పలుచోట్ల నేపాలీ పనివారిని ఉద్యోగంలో పెట్టుకున్న కుటుంబాలకు పోలీసులు నోటీసులు అందజేస్తున్నారు. ఇంట్లో పనిచేస్తున్న వారి పూర్తి వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, వారు ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరి ద్వారా పనికి చేరారు వంటి సమాచారం సమీప పోలీస్ స్టేషన్‌లో సమర్పించాలని కోరుతున్నారు.

పనివారిపై పూర్తిస్థాయి వెరిఫికేషన్ చేయించుకోవడం ఇప్పుడు తప్పనిసరిగా మారిందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఎలాంటి అనుమానాస్పద పరిస్థితులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కుటుంబంలో చోటుచేసుకున్న ఈ ఘటన నగరంలో కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇళ్లలో పనిచేసే వారిని నియమించుకునే సమయంలో సరైన వివరాలు తీసుకోవడం, వారి గుర్తింపు పత్రాలను పరిశీలించడం, పోలీస్ వెరిఫికేషన్ చేయించడం చాలా ముఖ్యమని అధికారులు చెబుతున్నారు. ప్రజల భద్రతే తమ ప్రధాన లక్ష్యమని హైదరాబాద్ పోలీసులు పేర్కొన్నారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…