LIVE
Liquor Scam: మద్యం విధానంలో భారీ అవకతవకలు జరిగాయి.. గత ప్రభుత్వంపై మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విమర్శలు!  •  Kollu Ravindra: జగన్ రెడ్డి పాలనపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర విమర్శలు.. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తుచేసిన మంత్రి!  •  Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. యూరప్ దేశాలతో బంధాల బలోపేతమే లక్ష్యం!  •  Promotions: దేవాదాయ శాఖలో భారీ ప్రమోషన్లు.. గ్రేడ్-1 ఆఫీసర్లుగా 26 మంది ఈఓలకు పదోన్నతులు!  •  TTD Updates: శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల తిరుమల దర్శన టికెట్ల కోటా షెడ్యూల్ విడుదల!  •  EPFO: పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్... 8.25 శాతం వడ్డీ డబ్బులు అకౌంట్లలోకి వచ్చేది అప్పుడే!  •  Allu Arjun: రెండు దశాబ్దాల తర్వాత అదే క్రేజ్... 'హ్యాపీ' రీ-రిలీజ్ కలెక్షన్ల సంచలనం!  •  Srisailam: శ్రీశైల క్షేత్రంలో రికార్డు స్థాయి ఆర్థిక ప్రగతి.. బ్యాంకుల్లో వందల కోట్ల భారీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు!  •  Google Maps: గూగుల్ మ్యాప్స్ క్రేజీ అప్‌డేట్.. ఇకపై పెట్రోల్, డీజిల్ ఖర్చులు మిగిలడం ఖాయం!  •  AP CRDA: 0.4 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో రూపుదిద్దుకుంటున్న నీరుకొండ రిజర్వాయర్...  • 
AndhraPravasi
AndhraPravasi
Latest Telugu and AP community news
⚡ BREAKING
Latest News

Mangalagiri: మంగళగిరిలో ఈగల్ హెడ్‌క్వార్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

Mangalagiri: మంగళగిరిలో ‘ఈగల్’ (EAGLE) హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

AndhraPravasi News Desk 1 min read
Mangalagiri: మంగళగిరిలో ఈగల్ హెడ్‌క్వార్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

మంగళగిరిలో ఈగల్ హెడ్‌క్వార్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా..

కార్యక్రమంలో పాల్గొన్న ఈగల్ ఐజీ రవికృష్ణ, పోలీసు ఉన్నతాధికారులు..

మంగళగిరిలో ‘ఈగల్’ (EAGLE) హెడ్‌క్వార్టర్స్ కార్యాలయాన్ని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఈగల్ ఐజీ రవికృష్ణతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కొత్తగా ప్రారంభమైన ఈ కార్యాలయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఈగల్ కార్యకలాపాలను ఒకే చోట నుంచి పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. డ్రగ్స్, గంజాయి నియంత్రణలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, గత ఏడాదిన్నర కాలంలో ‘ఈగల్’ విభాగం మంచి పనితీరు కనబరిచిందన్నారు. ఒకప్పుడు వేల ఎకరాల్లో సాగు అయిన గంజాయి పంటను ప్రస్తుతం దాదాపు జీరో స్థాయికి తీసుకువచ్చామని తెలిపారు. ఇది పోలీసు శాఖకు పెద్ద విజయమని పేర్కొన్నారు.

ఇప్పుడేమైతే గంజాయి సాగును నియంత్రించామో, ఇకపై వినియోగదారులపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నామని ఆయన స్పష్టం చేశారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల నియంత్రణకు సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని వివరించారు.

అదేవిధంగా, డ్రగ్స్ మరియు గంజాయి కేసుల వేగవంతమైన విచారణ కోసం రాష్ట్రంలో కొత్తగా 13 ఎన్‌డీపీఎస్ కోర్టులను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. ఈ చర్యలతో మాదక ద్రవ్యాల నియంత్రణలో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. ఈగల్ హెడ్‌క్వార్టర్స్ ప్రారంభంతో రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి నియంత్రణకు మరింత బలం చేకూరుతుందని అధికారులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Be the first to react

More Coverage

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 65 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు!

Padma Awards: దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప…