NDMA: దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్‌స్ లో రేపు అలర్ట్ సైరన్.. NDMA కీలక సూచనలు!
NDMA: దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లలో రేపు ఒక ప్రత్యేక అలర్ట్ సైరన్ వినిపించనుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి రూపొందించిన ఈ వ్యవస్థను పరీక్షించే భాగంగా ఈ ట్రయల్ నిర్వహించనున్నారు.
ప్రమాద సమయాల్లో ప్రజలను అలర్ట్ చేసే సైరన్..
భూకంపాలు, యుద్ధ సమయాల్లో అలర్ట్ చేసే ప్రయత్నం..
దేశవ్యాప్తంగా కోట్లాది మొబైల్ ఫోన్లలో రేపు ఒక ప్రత్యేక అలర్ట్ సైరన్ వినిపించనుంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను వెంటనే అప్రమత్తం చేయడానికి రూపొందించిన ఈ వ్యవస్థను పరీక్షించే భాగంగా ఈ ట్రయల్ నిర్వహించనున్నారు.
ఈ అలర్ట్ సిస్టమ్ ద్వారా భూకంపాలు, యుద్ధ పరిస్థితులు, ప్రకృతి విపత్తులు వంటి అత్యవసర సమయాల్లో ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రమాదం సంభవించే అవకాశాలు ఉన్నప్పుడు మొబైల్‌లలో సైరన్ మోగుతూ, హెచ్చరిక సందేశం కూడా కనిపించేలా ఈ సాంకేతికతను అభివృద్ధి చేశారు.
ఈ ట్రయల్‌ను నేషనల్ డిజాష్టర్ మ్యానేజ్మెంట్ అథారిటీ (NDMA) ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ప్రజలు వేగంగా స్పందించేలా ఈ వ్యవస్థ ఎంతవరకు ఉపయోగపడుతుందో పరీక్షించడమే దీని ముఖ్య ఉద్దేశం.
అయితే, ఈ సైరన్ కేవలం ట్రయల్ మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయానికి గురికావాల్సిన అవసరం లేదని NDMA స్పష్టం చేసింది. మొబైల్‌లో అలర్ట్ వినిపించినా ఆందోళన చెందకుండా, ఇది పరీక్షలో భాగమని గుర్తించాలని సూచించింది.
ఈ కార్యక్రమం ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ప్రజల భద్రతను మరింత మెరుగుపర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగుగా భావిస్తున్నారు.
Be the first to react