Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల! Ocean K-4: సముద్ర గర్భం నుంచి భారత్ గర్జన.. K-4 మిస్సైల్ టెస్ట్ సక్సెస్! Holiday: రేపు బాక్సింగ్ డే సెలవు.. లాంగ్ వీకెండ్‌తో టూరిస్ట్ స్పాట్లకు రద్దీ! Champion: ఫుట్‌బాల్ కల నుంచి స్వాతంత్ర్య పోరాటం వరకు.. ఛాంపియన్ కథ ఇదే! Students Alert: జేఈఈ, నీట్‌ పరీక్షలకు కొత్త రూల్స్..! ఆధార్‌ అప్‌డేట్ తప్పనిసరి! Students: గిరిజన విద్యార్థులకు ఏపీ సర్కార్ తీపికబురు..! రూ.100 కోట్ల స్కాలర్‌షిప్‌లు రిలీజ్! Two Wheeler Sales: నవంబర్‌లో హీరో స్ప్లెండర్ డామినేషన్..! టాప్‌ 10లో ఎవరిది ఎంత? Train Fares Hike: రేపటి నుంచే రైల్వే టికెట్ ఛార్జీల పెంపు! ఎంతో తెలుసా ? Cancer: క్యాన్సర్‌పై బ్రహ్మాస్త్రం.. యూనివర్సల్ వ్యాక్సిన్‌కు కీలక ముందడుగు! తిరుమలకు వస్తున్న భక్తులకు కీలక సూచన, చాలా రోజుల తర్వాత ఇలా! ఎందుకంటే! RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల!

RRB Group D: రైల్వే అభ్యర్థులకు అలర్ట్..! గ్రూప్–డీ CBT–1 కొత్త తేదీలు విడుదల!

2025-12-25 17:11:00
Tanzania Helicopter : టాంజానియాలో ఘోర ప్రమాదం.. పర్యాటకులతో వెళ్తూ కూలిపోయిన హెలికాప్టర్!

దేశ వ్యాప్తంగా ఉన్న రైల్వే రీజియన్లలో గ్రూప్–డీ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT–1) పరీక్షల షెడ్యూల్‌లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) సవరించిన పరీక్ష తేదీలతో కూడిన కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం 2026 జనవరి 1 నుంచి 16 వరకు గ్రూప్–డీ పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా, తాజాగా ఆ తేదీలను మార్చినట్లు ఆర్‌ఆర్‌బీ ప్రకటించింది. ఈ మార్పులతో లక్షలాది మంది అభ్యర్థులు తాజా షెడ్యూల్‌పై దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నిరుద్యోగులకు అదిరిపోయే 'రైల్వే' అప్‌డేట్.. 22,000 గ్రూప్-డి పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! పూర్తి వివరాలివే.!

సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆర్‌ఆర్‌బీ గ్రూప్–డీ CBT–1 పరీక్షలు 2026 జనవరి 8, 9 తేదీలతో పాటు ఫిబ్రవరి 2, 3, 4, 5, 6, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నారు. అంటే మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు దేశ వ్యాప్తంగా ఉన్న పలు కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో జరుగుతాయని ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సెషన్, పరీక్షా కేంద్రానికి అనుగుణంగా ముందుగానే సిద్ధం కావాలని సూచించింది. తాజా మార్పులతో పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను తరచూ పరిశీలించాలని సూచనలు జారీ చేసింది.

రాజభవనాలా - రైల్వే స్టేషన్లా? బ్రిటిష్ వైభవం.. ప్రకృతి అందం! ఈ 6 రైల్వే స్టేషన్లను చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

ఇక గ్రూప్–డీ పరీక్షలకు సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్‌గా ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ విడుదల తేదీని కూడా ఆర్‌ఆర్‌బీ వెల్లడించింది. అభ్యర్థులు తమ పరీక్ష కేంద్రం ఏ నగరంలో ఉందో తెలుసుకునేందుకు ఉపయోగపడే ఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్‌ను పరీక్ష తేదీకి పది రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉదాహరణకు జనవరి 8న పరీక్ష ఉన్న అభ్యర్థులకు డిసెంబర్ 29 నాటికి సిటీ స్లిప్ అందుబాటులోకి రానుంది. అలాగే అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి నాలుగు రోజుల ముందు వెబ్‌సైట్‌లో విడుదల చేయనున్నట్లు ఆర్‌ఆర్‌బీ స్పష్టం చేసింది.

స్విగ్గీ, జొమాటో యూజర్లకు అలర్ట్.. డెలివరీ బాయ్స్ సమ్మె.. మీ ఫుడ్ ఆర్డర్లు ఆలస్యమయ్యే ఛాన్స్!

ఇదే సమయంలో ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 2024 CBT–2 పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని కూడా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసింది. ఆన్సర్ కీతో పాటు ప్రశ్నపత్రం, రెస్పాన్స్ షీట్‌లను కూడా అభ్యర్థుల కోసం వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆన్సర్ కీపై అభ్యంతరాలు ఉంటే ఒక్కో ప్రశ్నకు రూ.50 చెల్లించి డిసెంబర్ 30 వరకు అభ్యంతరం తెలపవచ్చని బోర్డు తెలిపింది. డిసెంబర్ 20న దేశ వ్యాప్తంగా CBT–2 పరీక్షలు నిర్వహించగా, మొత్తం 51,978 మంది అభ్యర్థులు ఈ దశకు అర్హత సాధించారు. ఈ భర్తీ ప్రక్రియ ద్వారా కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ వంటి 3,445 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Kuwait Updates: కువైట్ వెళ్లేవారికి, అక్కడ ఉండేవారికి అలర్ట్.. కొత్త వీసా ఫీజులు, కఠిన నిబంధనలు అమల్లోకి!
Nidhi Agarwal: శివాజీ వ్యాఖ్యలపై నిధి అగర్వాల్ ఘాటు స్పందన.. డ్రెస్‌పై వ్యాఖ్యలు సరైందా!
New Mobile: తక్కువ ధరలో అదిరిపోయే స్టైల్.. బడ్జెట్ యూజర్లకు పండగే! ఏఐ కెమెరా, భారీ బ్యాటరీ...
2026 ఎలక్ట్రిక్ కార్ల జాతర! భారత రోడ్లపై పరుగులు తీయనున్న 6 సరికొత్త ఈవీలు! ఒకే ఛార్జ్‌తో 500 కి.మీ పైగా - సియెర్రా నుంచి సైరోస్ వరకు
Cyber Crime: కంబోడియా నుంచి నడిచిన సైబర్ ముఠా గుట్టురట్టు…! ఏపీ సీఐడీ భారీ ఆపరేషన్!
Aadhaar KYC: ఆధార్ అప్‌డేట్ మిస్ అవొద్దు! పిల్లల ఆధార్‌పై UIDAI కీలక సూచనలు!

Spotlight

Read More →