Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Chandrababu: ఏపీ ఇక గ్రీన్ ఎనర్జీ హబ్.. రూ. 5.95 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యం.. అభివృద్ధిపై సీఎం దార్శనికత.. Petrol prices: ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు.. పెట్రోల్, డీజిల్ నిల్వలు పుష్కలం.. పానిక్ బయింగ్ వద్దు! New Map: రాజధానిపై పార్లమెంట్ చట్టం.. కొత్త మ్యాప్‌లో స్పష్టమైన సరిహద్దులు.. 28 జిల్లాల ఆంధ్రప్రదేశ్! AP Government: ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం! ఇకపై గ్రామ సభలు.. కీలక ఆదేశాలు జారీ! Chandrababu: నేడు ఆ జిల్లాలో చంద్రబాబు పర్యటన! రూ.5,400 కోట్ల భారీ పెట్టుబడితో రెండు ప్రాజెక్టులు.. Chandrababu: అనకాపల్లిలో చంద్రబాబు పర్యటన... రూ. 5,400 కోట్ల మెగా ప్రాజెక్ట్ కు శంకుస్థాపన! Bullet Train: ఏపీలో బుల్లెట్ ట్రైన్! కొత్త రూట్ మ్యాప్ ఇదే... 2 గంటల్లో హైదరాబాద్!

High Court: సీనియర్ ఐఏఎస్ అహ్మద్‌బాబుపై ఏపీ హైకోర్టు ఆగ్రహం.. విచారణకు ఆదేశాలు

High Court: సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్‌బాబు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్‌గా కొనసాగడానికి వీల్లేదని కఠిన వ్యాఖ్యలు చేసింది.

Published : 2026-04-23 19:31:00

సీనియర్ IAS అహ్మద్‌బాబుపై ఏపీ హైకోర్టు మండిపాటు..

చట్టం, కోర్టు ఉత్తర్వులపై అహ్మద్‌బాబుకు గౌరవం లేదు..

అమరావతి: సీనియర్ ఐఏఎస్ అధికారి అహ్మద్‌బాబు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాగద్వేషాలతో వ్యవహరించే వ్యక్తి ఐఏఎస్‌గా కొనసాగడానికి వీల్లేదని కఠిన వ్యాఖ్యలు చేసింది.

ఈ సందర్భంగా ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, “మాకు అధికారాలు ఉంటే అహ్మద్‌బాబును వెంటనే సస్పెండ్ చేసేవాళ్లం” అని పేర్కొంది. ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైళ్లను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయడం, బీపీసీ నిర్వహించిన తర్వాత కూడా ప్రమోషన్లు ఇవ్వకుండా ఫైల్‌ను తొక్కిపెట్టడం సరైన విధానం కాదని అభిప్రాయపడింది.

ఇది ఉద్యోగులను వేధించడం కాదా? వారి జీవితాలతో ఇలా ఆటలాడటం సమంజసమేనా? అని కోర్టు ప్రశ్నించింది. చట్టం, కోర్టు ఉత్తర్వుల పట్ల అహ్మద్‌బాబుకు గౌరవం లేదని తీవ్రంగా విమర్శించింది.

అహ్మద్‌బాబుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతామని హైకోర్టు తెలిపింది. ఆరోపణలు నిజమని తేలితే ఆయనను డిస్మిస్ చేయాలని కూడా ఆదేశిస్తామని స్పష్టం చేసింది.

ఇక, అహ్మద్‌బాబు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి (సీఎస్) ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కోర్టు ప్రశ్నించింది. ఇంతటి ఆరోపణలు ఉన్నప్పటికీ ఆయనను అదే పోస్టులో కొనసాగించడం వెనుక కారణాలు ఏమిటో వివరించాలని కోరింది. ఇటువంటి అధికారులను లూప్‌లైన్‌లో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడింది.

పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై సీఎస్ ఎలాంటి చర్యలు తీసుకున్నారో తమ ముందుంచాలని అడ్వకేట్ జనరల్ (ఏజీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఈ పరిణామాలు రాష్ట్ర పరిపాలనలో చర్చనీయాంశంగా మారాయి.

Spotlight

Read More →