Sleeping: లేట్ నైట్ నిద్ర హార్ట్‌కు ప్రమాదం.. 16% పెరిగిన రిస్క్! ఇడ్లీ–దోశలు ఆరోగ్యమా..? ICMR రిపోర్ట్‌తో షాకింగ్ నిజాలు! Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!! Indigestion : అజీర్ణమే అన్ని రోగాలకు మూలం… ఆయుర్వేదం చెప్పిన సులభ పరిష్కారం! WHO భరోసా... నిపా వైరస్ వ్యాప్తి పరిమితమే! Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Sleeping: లేట్ నైట్ నిద్ర హార్ట్‌కు ప్రమాదం.. 16% పెరిగిన రిస్క్! ఇడ్లీ–దోశలు ఆరోగ్యమా..? ICMR రిపోర్ట్‌తో షాకింగ్ నిజాలు! Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!! Indigestion : అజీర్ణమే అన్ని రోగాలకు మూలం… ఆయుర్వేదం చెప్పిన సులభ పరిష్కారం! WHO భరోసా... నిపా వైరస్ వ్యాప్తి పరిమితమే! Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు!

Sleeping: లేట్ నైట్ నిద్ర హార్ట్‌కు ప్రమాదం.. 16% పెరిగిన రిస్క్!

లేట్ నైట్ లైఫ్ స్టైల్ గుండె ఆరోగ్యానికి హానికరం. బాడీ క్లాక్ డిస్ట్రబ్ అయితే గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

Published : 2026-02-03 12:15:00
Jana Sena Party meeting: ఆ ఒక్క మాటతో అందరిలో వణుకు .. జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.
  • బాడీ క్లాక్ దెబ్బతింటే గుండె జబ్బులే.. తాజా స్టడీ షాకింగ్ నిజాలు
  • లేట్ నైట్ అలవాటు ఉన్నవారికి హార్ట్ అటాక్, స్ట్రోక్ రిస్క్ ఎక్కువ
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం! ఇక వాటి కోసం ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..

లేట్ నైట్ నిద్ర అలవాటు చేసుకున్నారా? అయితే తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఆధునిక జీవనశైలి కారణంగా చాలా మంది రాత్రిపూట ఆలస్యంగా పడుకుని, ఉదయం ఆలస్యంగా లేవడం ఒక సాధారణ అలవాటుగా మారిపోయింది. పని ఒత్తిడి, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా, ఓటీటీ కంటెంట్, నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు వంటి కారణాల వల్ల నిద్ర సమయం పూర్తిగా మారిపోతోంది. కానీ ఈ అలవాటు గుండె ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ హార్ట్ అసోసియేషన్’ తాజాగా విడుదల చేసిన స్టడీ స్పష్టంగా చెబుతోంది.

ఏపీ మీదుగా సూపర్ కనెక్టివిటీ..! కోల్‌కతా–చెన్నై హైస్పీడ్ గ్రీన్‌ఫీల్డ్ కారిడార్!

ఈ అధ్యయనం ప్రకారం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వారిలో హార్ట్ అటాక్, స్ట్రోక్ వంటి ప్రమాదకర గుండె సంబంధిత సమస్యలు వచ్చే ముప్పు ఇతరులతో పోలిస్తే గణనీయంగా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా వీరిలో గుండె జబ్బుల రిస్క్ సుమారు 16 శాతం వరకు అధికంగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. దీనికి ప్రధాన కారణంగా మన శరీరంలో సహజంగా పనిచేసే ‘బాడీ క్లాక్’ లేదా సర్కేడియన్ రిథమ్ దెబ్బతినడమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ బాడీ క్లాక్ మన నిద్ర, హార్మోన్ల స్రావం, రక్తపోటు, హార్ట్ బీట్ వంటి అనేక కీలక అంశాలను నియంత్రిస్తుంది.

రాత్రి వేళల్లో నిద్ర ఆలస్యం కావడం వల్ల శరీరానికి అవసరమైన విశ్రాంతి సరిగా దొరకదు. దీని వల్ల ఒత్తిడి హార్మోన్లు పెరగడం, రక్తపోటు నియంత్రణ కోల్పోవడం, ఇన్సులిన్ పనితీరు తగ్గిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కలిసి గుండెపై అదనపు భారం పెడతాయి. అంతేకాదు, నిద్రలేమి కారణంగా శరీరంలో వాపు (ఇన్‌ఫ్లమేషన్) పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇదే హార్ట్ అటాక్, స్ట్రోక్‌లకు దారితీసే ప్రధాన కారకాలలో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు.

ఇక లేట్ నైట్ అలవాటు ఉన్నవారిలో వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, స్మోకింగ్, ఆల్కహాల్ వాడకం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఈ స్టడీ సూచిస్తోంది. ఇవన్నీ గుండె ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. ముఖ్యంగా పొగతాగడం వల్ల రక్తనాళాలు సంకుచితమవ్వడం, గుండెకు సరైన రక్తప్రసరణ జరగకపోవడం వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అలాగే సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరం రోజువారీ రిపేర్ ప్రక్రియను సరిగా నిర్వహించలేకపోతుంది.

కాబట్టి నిపుణుల సూచనల ప్రకారం రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల నాణ్యమైన నిద్ర తీసుకోవడం చాలా అవసరం. ప్రతిరోజూ ఒకే సమయానికి పడుకోవడం, ఒకే సమయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ముందు మొబైల్, ల్యాప్‌టాప్ వినియోగాన్ని తగ్గించడం, కాఫీన్ పానీయాలు మానుకోవడం, తేలికపాటి వ్యాయామం చేయడం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మొత్తానికి, లేట్ నైట్ నిద్ర ఒక చిన్న అలవాటు అనిపించినా, దీర్ఘకాలంలో ఇది ప్రాణాంతకమైన గుండె జబ్బులకు కారణమవుతుందని గుర్తించి, ఇప్పుడే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అత్యంత అవసరం.

Spotlight

Read More →