Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!! Indigestion : అజీర్ణమే అన్ని రోగాలకు మూలం… ఆయుర్వేదం చెప్పిన సులభ పరిష్కారం! WHO భరోసా... నిపా వైరస్ వ్యాప్తి పరిమితమే! Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Pregnancy Diet: గర్భధారణ ఒత్తిడిని దూరం చేసే ఆహార సూత్రాలు.. పూర్తి వివరాలు మీకోసం! పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? వాస్తవాలు ఇవే! Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!! Indigestion : అజీర్ణమే అన్ని రోగాలకు మూలం… ఆయుర్వేదం చెప్పిన సులభ పరిష్కారం! WHO భరోసా... నిపా వైరస్ వ్యాప్తి పరిమితమే! Teeth rotten: పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్‌తో మళ్లీ సహజంగా పెరుగుతాయి! Tamarind Health Benefits: వంటింటి ఔషధం చింతపండు పులుపు వెనుక దాగున్న అద్భుత ఆరోగ్య రహస్యాలివే! ఉల్లిపాయ పొట్టును పారేస్తున్నారా... ఈ లాభాలు తెలిస్తే ఇక ఎప్పటికీ అలా చేయరు! విటమిన్-సి లోపమా... ఈ 5 లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు! HealthyEating: మనం తినే ఆహారం అమృతమా? విషమా? గుడ్లు, పాలపై వచ్చే వార్తల్లో నిజమెంత? షాకింగ్ నిజాలు! Pregnancy Diet: గర్భధారణ ఒత్తిడిని దూరం చేసే ఆహార సూత్రాలు.. పూర్తి వివరాలు మీకోసం! పాలకూర, టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? వాస్తవాలు ఇవే!

Gac Fruit Health Benefits: గ్యాక్ ఫ్రూట్ ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు.. అరుదైన గ్యాక్ ఫ్రూట్ విశేషాలు మీకోసం.!!

అద్భుత పోషకాల గని గ్యాక్ ఫ్రూట్ పండులో క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు, కంటి చూపును మెరుగుపరిచే విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. దీనిని కూరగా ఎలా వండుకోవాలి? జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి? మరియు దీని వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకోండి

Published : 2026-02-02 13:50:00

నేటి కాలంలో ఆరోగ్యం పట్ల అవగాహన పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లలో కూడా విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి. ఈ క్రమంలో మన తెలుగు రాష్ట్రాల్లోకి ఒక అద్భుతమైన విదేశీ ఫలం అడుగుపెట్టింది. అదే ‘గ్యాక్ ఫ్రూట్’ (Gac Fruit).సాధారణంగా వియత్నాం వంటి ఆగ్నేయాసియా దేశాల్లో కనిపించే ఈ పండును, మన వాతావరణంలో సాగు చేస్తూ విజయం సాధించడం గమనార్హం.

నాలుగు రంగుల వింత.. రుచిలో అద్భుతం

గ్యాక్ ఫ్రూట్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది పెరిగే కొద్దీ నాలుగు దశల్లో రంగులు మారడం దీని ప్రత్యేకత. మొదట గదుల వంటి ఆకృతితో ఆకుపచ్చ  రంగులో ఉండి, తర్వాత పసుపు , ఆపై ఆరెంజ్  రంగులోకి మారుతుంది. పండు పూర్తిగా పక్వానికి వచ్చినప్పుడు ముదురు ఎరుపు రంగులోకి మారుతుంది. ఈ దశలోనే దీనిని జ్యూస్ కోసం ఉపయోగిస్తారు.

కూరగా మరియు జ్యూస్‌గా బహుళ ఉపయోగాలు

ఈ పండును కూరగా మరియు జ్యూస్‌గా రెండు రకాలుగా వాడుకోవచ్చు. పండు లేత పసుపు రంగులో  ఉన్నప్పుడు దీనిని కట్ చేసి కూర వండుకోవచ్చు. ఈ కూర రుచి ఎంత అద్భుతంగా ఉంటుందంటే, నాన్-వెజ్ ప్రియులు కూడా దీనిని తింటే ఫిదా అయిపోతారు. మాంసాహారం తిన్న దానికంటే ఎక్కువ సంతృప్తిని, ప్రోటీన్లను ఈ కూర అందిస్తుంది.

ఇక జ్యూస్ విషయానికి వస్తే, పండు పూర్తిగా ఎర్రగా మారినప్పుడు మధ్యలోకి కట్ చేయాలి. లోపల ఉండే ఎర్రటి విత్తనాలపై ఉన్న పొరను, ఎల్లో కలర్ ఆరను (గుజ్జును) వేరు చేసి పెట్టుకోవాలి. ఒక కేజీ బరువున్న పండుతో దాదాపు పది మందికి సరిపడా జ్యూస్ తయారు చేయవచ్చు. ఇందులో మీ టేస్ట్‌ను బట్టి పంచదార లేదా బెల్లం, అలాగే కొద్దిగా నిమ్మరసం కలిపి తీసుకుంటే అమృతంలా ఉంటుంది.

ఆరోగ్య ప్రయోజనాలు 

గ్యాక్ ఫ్రూట్‌ను స్వర్గపు ఫలం అని పిలుస్తారు. దీనిలో లైకోపీన్ మరియు బీటా-కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

క్యాన్సర్ నివారణ: ఇందులో ఉండే పోషకాలు క్యాన్సర్ కణాలతో పోరాడటంలో సహాయపడతాయి.

కంటి చూపు: కంటి చూపు మెరుగుపడటానికి ఇది రామబాణంలా పనిచేస్తుంది.

జుట్టు మరియు చర్మం: జుట్టు ఎదుగుదలకు, చర్మ సౌందర్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

 అల్పాహారానికి ప్రత్యామ్నాయం: ఉదయం పూట భారీగా ఇడ్లీలు, దోశలు తినే బదులు, ఒక గ్లాసు గ్యాక్ ఫ్రూట్ జ్యూస్ తాగితే రోజంతా కావాల్సిన శక్తి లభిస్తుంది.

Spotlight

Read More →