Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!! Nara Lokesh: రెడ్ బుక్ లో జగన్ పేరు ఉందో, లేదో త్వరలో - ఐడియాస్ ఆఫ్ ఇండియా 2026 సదస్సులో మంత్రి నారా లోకేష్ Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి.. Kolusu Parthasarathy: బాపట్ల జిల్లా అభివృద్ధిపై మంత్రి కొలుసు పార్థసారథి స్పెషల్ ఫోకస్.. AP Govt Jobs: వాళ్లకు గోల్డెన్ ఛాన్స్.. వెంటనే దరఖాస్తు చేసుకోవాలని ముఖ్యమంత్రి పిలుపు..!! Upamaka Temple: ఉపమాకలో వైభవంగా వెంకన్న కళ్యాణం! స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన హోం మంత్రి! Women Empowerment: అంగన్వాడీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్... వేసవి సెలవులు పెంపు.. 5G ఫోన్ల పంపిణీతో హైటెక్ సేవలు! Chandrababu: ఆ ప్రాంత వాసులకు గుడ్ న్యూస్.. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కోకో సిటీ ఏర్పాటు - సీఎం చంద్రబాబు ప్రకటన.!! Nara Lokesh: ఆంధ్రా యూనివర్సిటీకి పూర్వవైభవం - నారా లోకేష్! Indian Railways: రైల్వే గుడ్ న్యూస్... కన్ఫర్మ్డ్ టికెట్‌ను వేరొకరి పేరు మీదకు మార్చుకోవచ్చు! పూర్తి వివరాలు.... SAPChairman: వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఉంటే బాగుండేది.. శాప్ చైర్మన్ రవి నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు....!!

Minister Savita: బీసీ హాస్టళ్లు, గురుకులాల సిబ్బందికి మంత్రి సవిత ఆదేశం! కన్న బిడ్డల్లా హాస్టళ్ల విద్యార్థులను ఆదరించండి..

Minister Savita Speech About BC Hostel: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాళ్లను కన్న బిడ్డల్లా ఆదరించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరీక్షల నేపథ్యంలో హాస్టళ్లలో తరుచూ వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు.

Published : 2026-02-27 21:19:00
  • శ్రీకాకుళం రేళ్ల వీధి బీసీ హాస్టల్ లో డయేరియా కలకలకం..
     
  • ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులతో..

Minister Savita Speech About BC Hostel: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థుల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాళ్లను కన్న బిడ్డల్లా ఆదరించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, పరీక్షల నేపథ్యంలో హాస్టళ్లలో తరుచూ వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. చిన్న పాటి ఆరోగ్య సమస్య తలెత్తినా తక్షణమే ఆ విద్యార్థులకు మెరుగైన వైద్య సేవల నిమిత్తం సమీపంలోని ప్రభుత్వాసుపత్రులకు తరలించాలన్నారు. శ్రీకాకుళం రేళ్ల వీధి బీసీ హాస్టల్ లో డయేరియా కలకలకం నేపథ్యంలో మంత్రి సవిత శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో విభిన్నమైన వాతావరణ పరిస్థితులున్నాయన్నారు. 

వర్షాలు, చలి, వేడి... ఇలా భిన్నమైన వాతావరణ పరిస్థితులతో విద్యార్థులు అనారోగ్యం పాలయ్యే ప్రమాదముందన్నారు. టెన్త్, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కావడంతో, విద్యార్థులను కనిపెట్టుకుని ఉండాలన్నారు. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో తరుచూ వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించినా, తక్షణమే వారిని సమీప ప్రభుత్వాసుపత్రులకు తరలించాలన్నారు. బయట ఆహారాన్ని హాస్టళ్లలోకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించొద్దన్నారు. కన్నబిడ్డల్లా హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులను ఆదరించాలని డీబీసీడబ్ల్యూవోలు, వార్డెలకు మంత్రి సవిత స్పష్టంచేశారు. విద్యార్థుల ఆరోగ్య సంరక్షణలో  నిర్లక్ష్యం వహిస్తే క్షమించేది లేదని, అటువారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి సవిత హెచ్చరించారు.

శ్రీకాకుళం బీసీ హాస్టల్ లో డయేరియా కలకలంపై ఆరా
శ్రీకాకుళం రేళ్ల బీసీ హాస్టల్ లో విద్యార్థులకు డయేరియా సోకడంపై మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి  డీబీసీడబ్ల్యూవో అనురాధ, డీఎంహెచ్వో అనితను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుత నలుగురు విద్యార్థులూ కోలుకున్నారని, వారిలో ముగ్గురిని ఇప్పటికే డిశ్చార్జి చేశారని డీబీసీడబ్ల్యూవో అనురాధ మంత్రికి వివరించారు. మరో విద్యార్థి కూడా కోలుకున్నాడన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత స్పందిస్తూ...రేళ్ల బీసీ హాస్టల్ లో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించాలన్నారు. హాస్టల్ లో మిగిలిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తాజా ఆహారం, కాచి చల్లార్చిన నీటిని మాత్రమే విద్యార్థులకు ఇవ్వాలన్నారు. బీసీ హాస్టల్ లో నీరు నిల్వ ఉండనీయొద్దని మంత్రి సవిత స్పష్టంచేశారు.

Spotlight

Read More →