సాధారణంగా సెలవుల సీజన్ లేదా పండుగల సమయంలో రైళ్లలో టికెట్లు దొరకడం గగనమైపోతుంది. ముఖ్యంగా మచిలీపట్నం, తిరుపతి వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చే ప్రయాణికుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దక్షిణ మధ్య రైల్వే (SCR) కీలక నిర్ణయం తీసుకుంది. మచిలీపట్నం మరియు తిరుపతి నుంచి హైదరాబాద్కు, అలాగే తిరుపతి నుంచి ప్రయాగరాజ్కు ప్రత్యేక వన్-వే రైళ్లను ప్రకటించింది. ఈ రైళ్ల వల్ల వేలాది మందికి ఊరట లభించనుంది.
మచిలీపట్నం - ఉమ్డానగర్ మధ్య ప్రత్యేక రైలు (07297 నెంబర్) ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. ఇది ఈనెల 18వ తేదీన రాత్రి 9.15 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరుతుంది. మరునాడు ఉదయం 9.45 గంటలకు ఉమ్డానగర్ కు చేరుకుంటుంది.
ఈ స్పెషల్ ట్రైన్.. గుడివాడ, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి, కాచిగూడ స్టేషన్ల మీదుగా ఉమ్డానగర్ స్టేషన్కు చేరుకుంటుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
ఇక తిరుపతి - కాచిగూడ మధ్య ప్రత్యేక రైలు (07296 నెంబర్) అందుబాటులో ఉంటుంది.ఈ ట్రైన్ జనవరి 19వ తేదీన రాత్రి 7.40 నిమిషాలకు తిరుపతిలో బయల్దేరి… మరునాడు ఉదయం 9.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ ట్రైన్ రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి, మల్కాజిగిరి స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, 3ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లుంటాయి.
తిరుపతి - ప్రయాగరాజ్ మధ్య(ట్రైన్ నెంబర్ 07298 ) స్పెషల్ ట్రైన్ ఉంటుంది. ఈ ట్రైన్ డిసెంబర్ 20వ తేదీన తిరుపతి నుంచి ఉదయం 8.15 నిమిషాలకు బయల్దేరుతుంది. రెండో రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు ప్రయాగరాజ్ కు చేరుకుంటుంది.
ఈ ట్రైన్ రేణిగుంట, రాజంపేట, కడప, గుత్తి, గుంతకల్, మంత్రాలయం, రాయచూర్, వికారాబాద్, లింగంపల్లి, సికింద్రాబాద్, కాజీపేట్, పెద్దపపల్లి, మంచిర్యాల, కాగజ్ నగర్ మీదుగా వెళ్తుంది. ఈ ట్రైన్ లో 2ఏసీ, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్ లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.
రైల్వే శాఖ ప్రకటించిన ఈ ప్రత్యేక రైళ్లు 'వన్-వే' సర్వీసులు మాత్రమేనని గుర్తించాలి. అంటే ఇవి కేవలం వెళ్ళడానికి మాత్రమే అందుబాటులో ఉంటాయి.
ప్రయాణికులు గమనించాల్సిన విషయాలు
ముందస్తు బుకింగ్: స్పెషల్ ట్రైన్స్ అనగానే రద్దీ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా కౌంటర్ల ద్వారా వీలైనంత త్వరగా టికెట్లు బుక్ చేసుకోవడం ఉత్తమం.
ఫ్లెక్సీ ఫేర్: సాధారణ రైళ్లతో పోలిస్తే ప్రత్యేక రైళ్లలో ధరలు స్వల్పంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. వాతావరణ పరిస్థితులు లేదా ఇతర కారణాల వల్ల సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది, కాబట్టి ప్రయాణానికి ముందు 'నేషనల్ ట్రైన్ ఎంక్వైరీ సిస్టమ్' (NTES) యాప్లో చెక్ చేసుకోవాలి.
దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మచిలీపట్నం, తిరుపతి మరియు ప్రయాగరాజ్ వెళ్లే వారికి గొప్ప ఉపశమనం లభించనుంది. మీరు కూడా ఈ తేదీల్లో ప్రయాణం ప్లాన్ చేసుకున్నట్లయితే, వెంటనే టికెట్లు రిజర్వ్ చేసుకోండి.