UPSC: యూపీఎస్సీ పరీక్షల్లో సంచలన మార్పు..! ఇక అది తప్పనిసరి!

2026-01-11 12:11:00
Technology News: వాట్సాప్‌లో మరో అదిరిపోయే అప్‌డేట్.. కవర్ ఫోటో కూడా సెట్ చేసుకోవచ్చు!!

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పరీక్షల నిర్వహణలో చారిత్రకమైన మార్పుకు శ్రీకారం చుట్టింది. పరీక్షల్లో పారదర్శకతను మరింత పెంచడం, నకిలీ అభ్యర్థులు మరియు అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూపీఎస్సీ నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఫేస్ అథెంటికేషన్ (ముఖ గుర్తింపు విధానం) తప్పనిసరి చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ప్రతి అభ్యర్థి పరీక్షా కేంద్రంలో ప్రవేశించే సమయంలో ముఖ గుర్తింపు ప్రక్రియ నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ స్పష్టం చేసింది.

Vijayawada Highway: సంక్రాంతి రద్దీ.. HYD విజయవాడ హైవేపై 70 వేల వాహనాలు!

పీటీఐ వార్తా సంస్థ కథనం ప్రకారం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీని యూపీఎస్సీ ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేసింది. 2025 సెప్టెంబర్ 14న నిర్వహించిన ఎన్‌డీఏ (నేషనల్ డిఫెన్స్ అకాడమీ), ఎన్ఏ (నావల్ అకాడమీ) II, సీడీఎస్ (కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్) II పరీక్షల్లో ఈ విధానాన్ని పైలట్ ప్రోగ్రామ్‌గా పరీక్షించారు. గురుగ్రామ్‌లోని ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థుల ముఖాలను డిజిటల్‌గా స్కాన్ చేసి, వారి దరఖాస్తు ఫారాల్లో ఉన్న ఫొటోలతో తక్షణమే సరిపోల్చారు. ఈ ప్రక్రియ అత్యంత సమర్థవంతంగా పనిచేసిందని అధికారులు తెలిపారు.

Dmart: షాపింగ్‌కు ఇదే బెస్ట్ టైమ్..! డిమార్ట్‌లో నిత్యావసరాలపై భారీ డిస్కౌంట్లు!

ఈ కొత్త విధానంపై యూపీఎస్సీ ఛైర్మన్ అజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫేస్ అథెంటికేషన్ అమలుతో ఒక్కో అభ్యర్థి గుర్తింపు ధృవీకరణకు పట్టే సమయం సగటున 8 నుంచి 10 సెకన్లకు తగ్గిందని వెల్లడించారు. గతంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మాన్యువల్ చెకింగ్ వల్ల సమయం ఎక్కువగా పట్టేదని, ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో వేగంగా, తప్పుల్లేకుండా గుర్తింపు నిర్ధారణ సాధ్యమవుతుందని తెలిపారు. ఇది పరీక్షా కేంద్రాల్లో గందరగోళాన్ని తగ్గించడమే కాకుండా భద్రతను మరింత బలోపేతం చేస్తుందని ఆయన వివరించారు.

Vastu Tips: బాత్రూమ్ అద్దం అక్కడే ఉందా? ఇంట్లో ఇబ్బందులకు ఇదే కారణమా?

దేశవ్యాప్తంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి అత్యున్నత స్థాయి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షతో పాటు పలు పోటీ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లక్షలాది మంది అభ్యర్థులు హాజరయ్యే ఈ పరీక్షల్లో న్యాయం, సమానత్వం, విశ్వసనీయత ఎంతో కీలకం. ఫేస్ అథెంటికేషన్ విధానం అమలుతో నకిలీ అభ్యర్థులు, ప్రాక్సీ హాజరు వంటి అక్రమాలకు పూర్తిగా చెక్ పడుతుందని యూపీఎస్సీ భావిస్తోంది. ఆధునిక సాంకేతికతను పరీక్షా వ్యవస్థలోకి తీసుకువచ్చిన ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా పోటీ పరీక్షల నిర్వహణకు మార్గదర్శకంగా నిలవనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Owaisis comments: హిజాబ్‌లో ప్రధాని కల.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు!
KTM RC 160: కొత్త ఎంట్రీ-లెవల్ సూపర్‌స్పోర్ట్ బైక్... KTM RC 160 లాంచ్! ధర ఎంతంటే?
Gun Violence USA : అమెరికాలో మరోసారి తుపాకీ ఘోష.. మూడు చోట్ల కాల్పులు, ఆరుగురి బలి!
Winter Soups : శీతాకాలంలో ఆరోగ్యానికి రక్షణ కవచం.. ఈ 5 రకాలు సూప్స్ తప్పక ట్రై చేయండి!
Gandikota News: గండికోట ఉత్సవాల వెనుక దాగిన విషయం ఇదేనా?
Syria: సిరియాలో ఐసిస్‌పై అమెరికా మెరుపుదాడులు..! సిరియాలో ఐసిస్ స్థావరాలపై బాంబుల వర్షం!

Spotlight

Read More →